భారత్‌కు చేరిన చివరి రఫేల్.. శత్రు దేశాలకు ఇక చుక్కలే! - రఫేల్ యుద్ధ విమానాలు లాండింగ్ లేటెస్ట్ న్యూస్
36వ రఫేల్ యుద్ధ విమానం భారత్‌కు చేరుకుంది. ఈ విషయాన్ని భారత వాయుసేన వెల్లడించింది.
భారత్‌కు చేరిన చివరి రఫేల్ యుద్ధవిమానం
రఫేల్ యుద్ధ విమానాల్లో చివరిదైన 36వ ఎయిర్‌క్రాఫ్ట్ భారత్‌లో ల్యాండ్ అయింది. ఫ్రాన్స్ నుంచి బయల్దేరిన ఈ విమానం.. యూఏఈలో గాల్లోనే ఇంధనం నింపుకొంది. అనంతరం నిరంతరాయంగా ప్రయాణించి భారత్‌కు చేరుకుందని భారత వాయుసేన వెల్లడించింది. ఫ్రాన్స్‌కు చెందిన దసో ఏవియేషన్ అనే సంస్థ ఈ రఫేల్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. ఆ దేశంతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా భారత్‌కు 36 విమానాలు అందాయి.
Last Updated : Dec 15, 2022, 12:51 PM IST