భారత్- మయన్మార్ సరిహద్దులోని మణిపుర్లో అక్రమ ఆయుధాలు కలకలం రేపాయి. ముందస్తు సమాచారం మేరకు సరిహద్దులోని మణిపుర్ ప్రాంతంలో ఉన్న తీవ్రవాద ముఠా స్థావరాలపై దాడులు చేశాయి భద్రతాదళాలు. భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.
భారత్- మయన్మార్ సరిహద్దులో ఆయుధాల కలకలం - manipur
భారత్- మయన్మార్ సరిహద్దులోని మణిపుర్లో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని ధ్వంసం చేశాయి భద్రతా బలగాలు. భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. అంతకుముందు శుక్రవారం నిర్వహించిన ఓ ఆపరేషన్‌లో నాగాలాండ్‌కు చెందిన నిక్కి సుమి ఉగ్రవాద ముఠాను అదుపులోకి తీసుకున్నాయి భద్రతాదళాలు.
ఆయుధాలు స్వాధీనం
అంతకుముందు నాగాలాండ్ పెరెన్ జిల్లాలో నిక్కి సుమి గ్రూప్‌కు చెందిన ముఠాను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వారి నుంచి 32 పిస్తోళ్లు, ఒక చరవాణిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
ఇదీ చదవండి :'మన్ కీ బాత్ కాదు.. కొవిడ్ కీ బాత్ కావాలి'