తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆన్​లైన్​లో ల్యాప్​టాప్​ ఆర్డర్​ చేసిన వ్యక్తికి షాక్​.. ఓపెన్ చేసి చూస్తే...

ఆన్​లైన్​లో ఆర్డర్​ పెట్టిన వస్తువులు కాక వేరే ఏవో పంపించి అప్పుడప్పుడు కస్టమర్లకు షాకిస్తుంటాయి ఈ-కామర్స్​ సంస్థలు. తాజాగా మరోసారి అలానే జరిగింది. కొత్త ల్యాప్​టాప్​ వస్తుందని అనుకుంటే ఆ ప్యాకింగ్​లో వేరే వస్తువులు ఉండటం చూసి ఆశ్చర్యపోయారు కస్టమర్లు. ఇంతకీ ఏం జరిగిందంటే?

customer
కస్టమర్

By

Published : Jul 29, 2022, 6:55 PM IST

Updated : Jul 29, 2022, 7:29 PM IST

ఏ వస్తువులు కావాలన్నా ఆర్డర్​ చేస్తే ఇంటికి తెచ్చిచ్చే ఈ-కామర్స్​ సంస్థ అమెజాన్​ ఓ కస్టమర్​కు షాకిచ్చింది. ఖరీదైన ల్యాప్​టాప్​ ఆర్డర్​ పెడితే ఓ టెక్స్ట్​ బుక్​, రెండు ఇటుక ముక్కలు వచ్చాయి. ఈ ఆర్డర్​ చూసి వినియోగదారులు కంగుతిన్నారు. ఈ ఘటన బిహార్​లోని పట్నాలో జరిగింది.

"మాకు ఇంట్లో ల్యాప్​టాప్​ అవసరమైంది. అందుకే దిల్లీలో ఉండే మా అబ్బాయి సౌరవ్ సుమన్.. తండ్రి శ్యామ్​ సుందర్​ ప్రసాద్​కు అమెజాన్​లో రూ.34,600 విలువ చేసే ల్యాప్​టాప్​ను ఆర్డర్​ చేశాడు. వాళ్లు చెప్పిన తేదీ ప్రకారమే బుధవారం ఆర్డర్​ వచ్చింది. కానీ ఆర్డర్​ తీసుకున్నాక నాకు ఎందుకో అనుమానం వచ్చింది. ల్యాప్​టాప్​ ఉండాల్సిన బరువు కండే ప్యాకింగ్​ చాలా తేలికగా ఉంది. తీసి చూస్తే అందులో ఓ పుస్తకం, రెండు ఇటుకలు ఉన్నాయి. మా అబ్బాయి సూచన మేరకు అది వీడియో తీయడం ఉపయోగపడింది."

-సునీతా కనోడియా, కస్టమర్

ఈ ఘటనపై బాధితులు కస్టమర్​కు కాల్ చేసి ఫిర్యాదు చేయగా.. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై స్పందించిన అమెజాన్ మీడియా ప్రతినిధి సుమన్​ ప్రసాద్.. తనకు ఈ ఘటనకు గురించి తెలియదని, కానీ దీనిపై తగిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ విషయంపై స్పష్టత వచ్చేందుకు ఈనెల 31వరకు సమయం ఇవ్వాలని బాధితులను అమెజాన్​ అడిగినట్లు తెలుస్తోంది.

కస్టమర్​కు అమెజాన్ ట్విస్ట్​

ఇదీ చూడండి :ఆ సిటీలో ఒకే రోజు ఐదుగురు సూసైడ్.. అసలేం జరిగింది?

Last Updated : Jul 29, 2022, 7:29 PM IST

ABOUT THE AUTHOR

...view details