తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిరసన గళం.. సెక్రటేరియట్​ ఎదుటే రైతులు

హరియాణాలో రైతులు చేపట్టిన నిరసనలు రాత్రి వేళలోనూ కొనసాగుతున్నాయి. కర్నాల్​ మినీ సచివాలయం ఎదుటే బైఠాయించారు కర్షకులు. వారికి పలువురు భోజనాలు ఏర్పాటు చేశారు.

farmers protesting
సెక్రటేరియట్​ ఎదుటే రైతులు

By

Published : Sep 7, 2021, 10:49 PM IST

హరియాణా కర్నాల్​లోని మినీ సెక్రటేరియట్​ను చుట్టుముట్టేందుకు తరలివచ్చిన వేలాది మంది రైతులు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. సచివాలయం ఎదుటే బైఠాయించారు. ఈక్రమంలో నిరసనల్లో పాల్గొన్న రైతులకు భోజనాలు ఏర్పాటు చేశారు స్థానిక నేతలు.

సెక్రెటేరియట్​ ఎదుట ఆందోళనలో పాల్గొన్న రైతులు
భోజనం చేస్తున్న రైతులు

మరోవైపు.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా హరియాణా ప్రభుత్వం పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. పోలీసులు సైతం సచివాలయం వద్దే ఉండాల్సి వచ్చింది. ఓవైపు పోలీసులు, మరోవైపు రైతులతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది.

రోడ్డుపైనే భోజనం చేస్తున్న రైతులు
సచివాలయం వద్ద మోహరించిన బలగాలు

లాఠీఛార్జ్​కు నిరసనగా..

ఆగస్టు 28న కర్నాల్​ ప్రాంతంలో రైతులపై పోలీసులు లాఠీఛార్జ్​ చేశారు. సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలని రైతు సంఘాలు అప్పటి నుంచి డిమాండ్​ చేస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం న్యూ అనాజ్​ మండీ వద్ద మహాపంచాయత్​ నిర్వహించగా.. సభకు పంజాబ్​, హరియాణా, ఉత్తర్​ప్రదేశ్​ నుంచి వేలాది మంది రైతులు తరలివెళ్లారు. లాఠీఛార్జ్​కు ఆదేశాలిచ్చిన ఐఏఎస్​ అధికారిని సస్పెండ్​ చేయాలన్నదే తమ డిమాండ్​ అని బీకేయూ నేత రాకేశ్​ టికాయత్​ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:రైతుల నిరసన బాట- హరియాణాలో ఉద్రిక్తత

ABOUT THE AUTHOR

...view details