Lancet's report on high Covid 19: భారత్‌లో 40లక్షల కరోనా మరణాలు సంభవించాయన్న.. లాన్సెట్ జర్నల్ నివేదికను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. అందులో ఎలాంటి వాస్తవం లేదని.. ఆరోగ్యశాఖ తేల్చి చెప్పింది. లాన్సెట్ పరిశోధకులు పరిగణలోకి తీసుకున్న అంశాలు.. ప్రామాణికమైనవి కాదని పేర్కొంది. వార్త పత్రికల కథనాలు.. గుర్తింపు లేని అధ్యయనాలను లాన్సెట్ తీసుకొని ఉండొచ్చని కేంద్రం అభిప్రాయపడింది.
భారత్‌లో 40 లక్షల కొవిడ్ మరణాలు.. ఖండించిన కేంద్రం - భారత్‌లో కొవిడ్ మరణాలు
Lancet's report on high Covid 19: భారత్‌లో కరోనాతో రెండేళ్లకాలంలో 40.07 లక్షల మంది మరణించినట్లు లాన్సెట్ జర్నల్ నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టింది. వార్త పత్రికల కథనాలు, గుర్తింపులేని అధ్యయనాలను లాన్సెట్ పరిగణలోకి తీసుకొని ఉండొచ్చని కేంద్రం అభిప్రాయపడింది.
భారత్‌లో కొవిడ్ మరణాలు
మరోవైపు.. ప్రపంచ దేశాల్లో కరోనా మృతులకు సంబంధించిన వివరాలను.. లాన్సెట్ గురువారం విడుదల చేసింది. భారత్‌లో 2020 జనవరి 1 నుంచి.. 2021 డిసెంబర్ 31 మధ్య 40.07 లక్షల మంది కరోనాతో చనిపోయినట్లు పేర్కొంది. ప్రపంచ మరణాల్లో.. భారత్ వాటా 22.3 శాతంగా ఉందని వెల్లడించింది. కానీ.. భారత్‌లో 5.15 లక్షణ మరణాలు మాత్రమే సంభవించినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.