తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇంట్లో జారిపడ్డ లాలూ! భుజం, వెన్నెముకకు గాయాలు - లాలు ప్రసాద్​ న్యూస్​

ఆర్​జేడీ అధినేత, బిహార్​ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ గాయపడ్డారు. పట్నాలోని తన సతీమణి రబ్రీదేవి నివాసంలో ఉంటున్న ఆయన.. మెట్లు ఎక్కుతుండగా జారిపడ్డారు. ఈ క్రమంలో ఆయన భుజం విరిగింది.

lalu prasad yadav latest news
lalu prasad yadav latest news

By

Published : Jul 3, 2022, 10:55 PM IST

ఆర్​జేడీ అధినేత, బిహార్​ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్​ గాయపడ్డారు. పట్నాలోని తన సతీమణి రబ్రీదేవి నివాసంలో ఉంటున్న ఆయన.. మెట్లు ఎక్కుతుండగా జారిపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన భుజం విరగగా.. వెన్నెముకకు గాయం అయినట్లు సన్నిహితులు తెలిపారు. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. చికిత్స అందించి మందులు ఇచ్చినట్లు వైద్యులు చెప్పారు. ఆయనకు అంతకుముందే అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే కిడ్నీ సమస్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీని కోసం కోర్టు నుంచి సైతం అనుమతి తీసుకున్నారు.

Fodder scam: దాణా కుంభకోణం కేసులో ఆర్​జేడీ అధినేత, బిహార్​ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్​ యాదవ్​కు ఇప్పటికే శిక్ష ఖరారైంది. రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు ఐదేళ్లు జైలు శిక్ష, రూ.60లక్షలు జరిమానా విధిస్తున్నట్లు ఫిబ్రవరి 21న తీర్పు వెలువరించింది. దాణా కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే నాలుగు కేసుల్లో లాలూ దోషిగా తేలారు. దోరండా ఖజానా నుంచి రూ.139.35కోట్లు దుర్వినియోగం కేసు ఐదోది, చివరిది.

ఇదీ చదవండి:సీఎం పదవి దక్కడం యాదృచ్ఛికం: శిందే

ABOUT THE AUTHOR

...view details