బిహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని భాజపా నేత సుశీల్ కుమార్ మోదీ ఆరోపించారు. ఆర్జేడీ అధికారంలో వచ్చేలా ఎన్డీఏ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
ఇందుకు సంబంధించిన ఓ ఆడియో టేప్‌ను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు మోదీ. దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి వద్దకు సెల్‌ఫోన్ ఎలా వచ్చిందని మండిపడ్డారు.
"రాంచి నుంచి ఎన్డీఏ ఎమ్మెల్యేకు లాలూ ప్రసద్ ఓ నంబర్ నుంచి ఫోన్ చేసి మాట్లాడారు. ఆయనకు మంత్రి పదవులు ఇస్తామని హామీలు ఇచ్చారు.
నేను అదే నంబర్‌కు కాల్చేసి మాట్లాడాను. లాలూనే నేరుగా ఫోన్ లిఫ్ట్ చేశారు. జైలులో ఉండి ఇలా పనులు చేయవద్దని.. మీరు గెలవలేరని చెప్పా."
- సుశీల్ కుమార్ మోదీ