తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లాలూకు అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స - లాలూ కు అస్వస్థత

Lalu Prasad Yadav health: లాలూప్రసాద్‌ యాదవ్‌ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉందని వైద్యులు తెలిపారు.

Lalu Prasad Yadav health
లాలూకు అస్వస్థత

By

Published : Feb 21, 2022, 9:03 PM IST

Lalu Prasad Yadav health: ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గానే ఉందని వైద్యులు తెలిపారు.

మరోవైపు, గతంలో బిహార్‌ రాష్ట్రాన్ని కుదిపేసిన దాణా కుంభకోణంలో చిట్టచివరిది, అయిదోది అయిన డొరండా ఖజానా కేసులో లాలూకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈరోజు ఆయనకు ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. అలాగే, రూ.60 లక్షల జరిమానా కూడా విధించింది. లాలూతో పాటు మరో 99 మంది నిందితులపై విచారణ జరిపిన రాంచీలోని న్యాయస్థానం.. జనవరి 29న తీర్పును రిజర్వులో ఉంచగా.. గత మంగళవారం ఈ కేసులో లాలూను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే.

తాజాగా సోమవారం తుది తీర్పును వెల్లడించిన న్యాయస్థానం ఈ కేసులో మరో 46 మందికి కోర్టు మూడేళ్ల జైలు శిక్షను విధించింది. 24 మందిని నిర్దోషులుగా తేల్చింది.

ఇదీ చూడండి:మోదీ-యోగికి ప్రజా సమస్యలు పట్టవు: సోనియా

ABOUT THE AUTHOR

...view details