జనతా దళ్ యునైటెడ్(జేడీయూ) పార్టీ నూతన అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్.. లలన్ సింగ్ ఎన్నికయ్యారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్ అధ్యక్షత జరిగిన జేడీయూ జాతీయ కార్యవర్గం సమావేశంలో నూతన అధ్యక్షుడిని ఎన్నుకున్నారు.
జేడీయూ పార్టీ నూతన అధ్యక్షుడిగా లలన్ సింగ్ - నితీశ్ కుమార్
జనతా దళ్ యునైటెడ్ పార్టీ నూతన అధ్యక్షుడిగా రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ ఎన్నికయ్యారు. ఆర్సీపీ సింగ్ కేంద్ర మంత్రి కావటం వల్ల ఖాళీ అయిన అధ్యక్ష బాధ్యతలను లలన్‌కు అప్పగించారు బిహార్ సీఎం నితీశ్ కుమార్.
లలన్ సింగ్
ఇంతకుముందు జేడీయూ అధ్యక్షుడిగా ఉన్న ఆర్సీపీ సింగ్‌కు కేంద్ర మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కింది. ఈ క్రమంలోనే జేడీయూ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో సీఎం నితీశ్‌కు అత్యంత సన్నిహితుడైన ముంగేర్ పార్లమెంట్ సభ్యుడు లలన్ సింగ్.. అధ్యక్షుడిగా జేడీయూ పార్టీ పగ్గాలు అందుకున్నారు.
ఇదీ చూడండి:BJP x JDU: కేంద్ర కేబినెట్ బెర్తుకు పోరు!