'యూపీ లఖింపుర్(Lakhimpur Kheri News) ఘటనకు కారణమైన కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను.. మంత్రి పదవి నుంచి తొలగించాలి' అని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi Vadra News). ఈ మేరకు కాంగ్రెస్ నాయకులతో కలిసి లఖ్‌నవూలోని గాంధీ విగ్రహం వద్ద మౌనదీక్ష చేపట్టారు. యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ, కాంగ్రెస్ నాయకులు ఆరాధన మిశ్రా, దీపక్ సింగ్.. తదితరులు దీక్షలో పాల్గొన్నారు. లఖింపుర్(lakhimpur kheri incident) ఘటనపై విచారణ పారదర్శకంగా జరగాలంటే అజయ్ మిశ్రాను(Ajay Mishra News)మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
అంతకుముందు ఆదివారం రోజు వారణాసిలో ర్యాలీ నిర్వహించారు ప్రియాంక. ఈ క్రమంలో లఖింపుర్ ఘటనపై కీలక వ్యాఖ్యలు చేశారు.
"కాంగ్రెస్ కార్యకర్తలను జైళ్లో పెట్టినా, వారిపై దాడులు చేసినా భయపడరు. కేంద్ర మంత్రి రాజీనామా చేసేంతవరకు మా పోరాటం ఆగదు. మా పార్టీ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడింది. మా నోరు ఎవరూ మూయలేరు."
-- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేత
ఈ నెల 3వ తేదీన లఖింపుర్ ఖేరిలో(Lakhimpur Violence) సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన తెలుపుతున్న సమయంలో ఆశిష్ మిశ్రా కారు అక్కడున్న రైతులపైకి దూసుకెళ్లింది. దీంతో నలుగురు రైతులు సహా 8 మంది మృతి చెందారు.