లఖింపుర్ ఖేరి హింసాత్మక(Lakhimpur Kheri violence) ఘటనపై శుక్రవారం విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు(Supreme court). సిట్ దర్యాప్తు పర్యవేక్షణకు వేరే రాష్ట్రాల హైకోర్టు మాజీ న్యాయమూర్తుల నియామకం అంశంపై తమ వైఖరి తెలిపేందుకు ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వానికి సోమవారం(నవంబర్ 15) వరకు గడువు ఇచ్చింది.
లఖింపుర్ ఘటనను సుమోటాగా స్వీకరించి విచారణ జరుపుతోంది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ(Chief Justice N V Ramana) నేతృత్వంలోని ధర్మాసనం. ఈ సందర్భంగా యూపీ ప్రభుత్వం తరఫున గడువు కోరారు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే. 'సోమవారం వరకు సమయం ఇవ్వండి. ఈ అంశంపై దాదాపు పని పూర్తి చేశాం. ఇంతర అంశాలను సైతం పరిశీలిస్తున్నాం.' అని తెలిపారు.
న్యాయవాది అభ్యర్థన మేరకు విచారణను వాయిదా వేసిన ధర్మాసనం.. సోమవారం తమ వైఖరి తెలపాలని స్పష్టం చేసింది.