తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'లఖింపుర్​ ఖేరీ' కేసులో కేంద్రమంత్రి కుమారుడికి బెయిల్ - సుప్రీంకోర్టులౌో లఖింపుర్​ ఖేరీ కేసు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపుర్ ఖేరీ కేసులో నిందితుడు కేంద్ర మంత్రి అజయ్​ కుమార్​ మిశ్రా, కుమారుడు ఆశిశ్​ మిశ్రాకు సుప్రీంకోర్టు​ బెయిల్ మంజూరు చేసింది. 8 వారాల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్​ను మంజూరు చేసింది.

lakhimpur Kheri violence case
lakhimpur Kheri violence case

By

Published : Jan 25, 2023, 11:15 AM IST

Updated : Jan 25, 2023, 12:14 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​ ఖేరీ దుర్ఘటన కేసులో కేంద్ర మంత్రి అజయ్​ కుమార్​ మిశ్రా కుమారుడు ఆశిశ్​ మిశ్రాకు భారత సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్​ను మంజూరు చేసింది. 8 వారాల పాటు షరతులతో కూడిన బెయిల్​ను సుప్రీంకోర్టు బుధవారం మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్​ వ్యవధిలో ఆశిశ్​.. దేశ రాజధాని దిల్లీ, ఉత్తర్​ ప్రదేశ్​లో ఉండరాదని.. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన ధర్మాసనం ఆదేశించింది. లఖింపుర్​ ఖేరీ హింస కేసులో మిశ్ర బెయిల్ పిటిషన్‌ను ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకించింది. బెయిల్ నిరాకరించిన అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిశ్​ మిశ్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతడి వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం ఆశిశ్​ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసింది.

అంతకుముందు తనకు బెయిల్​ ఇవ్వాల్సిందిగా నిందితుడు ఆశిశ్​ మిశ్రా వేసిన పిటిషన్​పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్​లో పెట్టింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితులను ఎల్లకాలం నిర్బంధించి ఉంచలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసులో అత్యంత దారుణంగా కారాగారంలో మగ్గుతున్న బాధితులు రైతులేనని.. ఆశిశ్​ మిశ్రకు బెయిల్​ మంజూరు చేయకపోతే, వారు కూడా జైల్లోనే ఉండే అవకాశం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేస్తూ.. ఇది ఇరువర్గాల హక్కులను సమతుల్యం చేసే కేసు అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

2021 అక్టోబర్‌ 3న ఉత్తర్​ ప్రదేశ్‌ లఖింపుర్ ఖేరీలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులపైకి కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడి వాహనం దూసుకెళ్లింది. ఆ సమయంలో ఆశిశ్ మిశ్రా వాహనంలో ఉన్నారు. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించారు. అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఆశిశ్ మిశ్ర అరెస్టయ్యారు.

Last Updated : Jan 25, 2023, 12:14 PM IST

ABOUT THE AUTHOR

...view details