Lakhimpur kheri tigress:ఉత్తర్ప్రదేశ్ లఖింపుర్ ఖేరిలో మనుషులను చంపి తింటూ, ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న ఓ ఆడపులిని అధికారులు బంధించారు. ఇప్పటివరకు 21 మందిని చంపిన ఆ పులిని సోమవారం రాత్రి అటవీ అధికారులు పట్టుకున్నారు. దీంతో స్థానిక ప్రజలకు ఉపశమనం లభించినట్లైంది.
ఇనుప బోనులో పులిని నిర్బంధించినట్లు దుధ్వా ఫీల్డ్ డైరెక్టర్ సంజయ్ పాఠక్ తెలిపారు. కొద్దిరోజుల పాటు పులిని అందులోనే ఉంచనున్నట్లు చెప్పారు. దాని ఆరోగ్యాన్ని కాపాడేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. వైద్యులు, వన్యప్రాణి నిపుణుల సంరక్షణలో పులిని ఉంచుతున్నట్లు తెలిపారు. అయితే, ఇన్నాళ్లూ మనుషులను చంపి తిన్న పులి ఇదేనా అన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.