ఉత్తర్ప్రదేశ్ లఖింపుర్ హింసాత్మక ఘటనపై(lakhimpur kheri incident) నిరసనగా నిరాహార దీక్షకు దిగారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(priyanka gandhi news today). లఖింపుర్కు వెళ్తున్న నేపథ్యంలో ఆమెను పోలీసులు సితాపుర్ వద్ద అరెస్టు చేయగా.. అక్కడే ఆమె నిరాహార దీక్ష చేపట్టినట్టు పార్టీ ప్రకటించింది.
హింసాత్మక ఘటనలో మృతిచెందిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు గాంధీ(up news priyanka gandhi) వెళ్లారు. ఆమె వెంట కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. అయితే రైతుల కుటుంబాలను చూడనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. సీతాపుర్లోని ఓ అతిథి గృహానికి తరలించి గృహ నిర్బంధంలో ఉంచారు.
"కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని అరెస్టు చేశారు. ఆమె నిరాహార దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసలు చేస్తున్నారు. మా డిమాండ్లకు ప్రభుత్వం తలవంచాల్సిందే. న్యాయం కోసం మరింత శక్తితో గళమెత్తుతాం."
-- ఉత్తర్ప్రదేశ్ కాంగ్రెస్.
ప్రియాంక గాంధీకి సంబంధించి.. ఓ వీడియోను పార్టీ విడుదల చేసింది. అతిథి గృహంలో చీపురు పట్టుకుని తన గదిని శుభ్రం చేస్తూ కనపడ్డారు ప్రియాంక.
నిరసనలకు పిలుపు...
ప్రియాంక గాంధీ బృందాన్ని అరెస్టు చేయడంపై కాంగ్రెస్ మండిపడింది. రాజకీయ నేతలు ఎక్కడికైనా ప్రయాణించవచ్చని.. వారి స్వేచ్ఛను హరింపజేయడం అత్యంత ప్రమాదకరమని సీనియర్ నేత రాజివ్ శుక్లా మండిపడ్డారు. ఈ ఘటనకు నిరసనగా.. మంగళవారం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల ముందు ఆందోళనలు చేపడతామని ప్రకటించారు.