ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటనలో(lakhimpur kheri incident ) మృతి చెందిన ఇద్దరు భాజపా కార్యకర్తలు(bjp lakhimpur kheri), కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా డ్రైవర్ కుటుంబాలకు రూ.45 లక్షల చొప్పున పరిహారం అందించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఈ ముగ్గురిలో ఇద్దరు సంఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
అక్టోబర్ 3వ తేదీన లఖింపుర్ ఖేరిలో చెలరేగిన ఘర్షణలో మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో నలుగురు రైతులు, ఓ పాత్రికేయుడు, ఇద్దరు భాజపా సభ్యులు, కారు డ్రైవర్ ఉన్నారు. ఇప్పటికే.. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రైతులు, జర్నలిస్ట్ కుటుంబాలకు రూ.45 లక్షల చొప్పున పరిహారం అందించింది ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం.