తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Lady Constables Dragged Woman : మహిళపై లేడీ కానిస్టేబుళ్ల దారుణం.. రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లి..

Lady Constables Dragged Woman : జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళపై ఇద్దరు లేడీ​ కానిస్టేబుళ్లు దారుణంగా ప్రవర్తించారు. ఎస్పీ ఆఫీస్​ నుంచి పోలీస్ స్టేషన్​కు రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఉత్తర్​ప్రదేశ్​లో ఈ ఘటన జరిగింది.

lady-constables-dragged-woman-in-uttar-pradesh-constable-suspended-by-sp
మానసిక స్థితి బాగాలేని మహిళను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన పోలీసులు

By ETV Bharat Telugu Team

Published : Oct 1, 2023, 10:24 AM IST

Updated : Oct 1, 2023, 11:50 AM IST

Lady Constables Dragged Woman :మానసిక స్థితి బాగాలేని ఓ మహిళను రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు ఇద్దరు లేడీ​ కానిస్టేబుళ్లు. ఫిర్యాదు అందించేందుకు ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఆమెను.. సాటి మహిళ అని చూడకుండా పోలీస్​స్టేషన్​కు లాక్కెళ్లారు. ఉత్తర్​ప్రదేశ్​లోని హర్దోయీ జిల్లాలో శనివారం ఈ ఘటన జరిగింది. అందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారడం వల్ల.. విషయం ఎస్పీ దృష్టికి వెళ్లింది. దీంతో ఆ మహిళా కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. ​

పిహాని ప్రాంతానికి చెందిన మహిళ.. ఎస్పీ ఆఫీస్ గోడ ఎక్కేందుకు ప్రయత్నం చేసిందని పోలీసులు ఆరోపిస్తున్నారు. అందుకే ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్​కు తరలించినట్లు వారు చెబుతున్నారు. మహిళ మాత్రం తాను ఓ విషయంపై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చానని అంటోంది. అయితే తనను ఎస్పీ ఆఫీస్​ వెళ్లకుండా దారుణంగా పోలీస్​ స్టేషన్​కు ఈడ్చుకెళ్లారని ఆమె వాపోయింది. ఎంత బతిమాలినా వినలేదని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలిని ఈడ్చుకెళ్లిన మహిళా పోలీసులను మల్దా పర్వీన్, విజయలక్ష్మిగా ఉన్నతాధికారులు గుర్తించారు.

మహిళను ఈడ్చుకెళ్తున్న లేడీ కానిస్టేబుళ్లు

ఈ ఘటన మొత్తాన్ని మొబైల్​లో వీడియో తీశాడు ఓ యువకుడు. అనంతరం దాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశాడు. ఆ పోస్ట్​ కాస్త వైరల్​గా మారి.. జిల్లా ఎస్పీ కేశవచంద్ గోస్వామి దృష్టికి వెళ్లింది. ఘటనపై ఆరా తీసిన ఎస్పీ ఆ ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నారు. విధుల నుంచి సస్పెండ్​ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై విచారణను సీఓ సివిల్ లైన్​ అధికారులకు అప్పగించారు. కేసు కూడా నమోదు చేసినట్లు ఎస్పీ కేశవచంద్ గోస్వామి వెల్లడించారు.

Woman Constable Gender Change :ఇటీవలే ఉత్తర్​ప్రదేశ్​.. గోరఖ్​పుర్​లో ఓ మహిళా కానిస్టేబుల్​.. తాను పురుషుడిగా మారేందుకు అనుమతించాలంటూ డీజీపీకి లేఖ రాసింది. అందులో తనకు మహిళగా ఉండటం ఇష్టం లేదని.. చిన్నప్పటి నుంచి పురుషుడిలా బతకాలని అనుకుంటున్నట్లు తెలిపింది. ఒకవేళ అనుమతి నిరాకరిస్తే కోర్టును ఆశ్రయించడానికి కూడా వెనకాడనంటోంది. లింగమార్పిడి కోసం ఇప్పటికే వైద్యులను కూడా కలిసిందీ పోలీస్​. పూర్తి వివరాల కోసంఈ లింక్​పై క్లిక్​ చేయండి.

డ్యూటీలో లేడీ కానిస్టేబుల్ డ్యాన్స్ వీడియో వైరల్

gang rape: పార్టీకి పిలిచి.. మహిళా కానిస్టేబుల్​పై గ్యాంగ్​ రేప్​

Last Updated : Oct 1, 2023, 11:50 AM IST

ABOUT THE AUTHOR

...view details