తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాష్ట్రంలోనే తొలి లేడీస్ గ్యారేజ్- బైక్​ల రిపేర్​కు సూపర్ రెస్పాన్స్! ఎక్కడో తెలుసా? - కేరళలో బైక్ రిపేర్ షాపు పెట్టిన మహిళలు

Ladies First Two Wheeler Workshop In Kerala : రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా బైక్​ రిపేర్​ షాప్​ను పెట్టారు కేరళకు చెందిన ముగ్గురు మహిళలు. పెట్టిన మొదటి రోజే మంచి స్పందన వచ్చింది. ఈ రంగంలోకి రావాలని ఆసక్తి ఉన్న మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు ఆ ముగ్గురు.

Ladies First Two Wheeler Workshop In Kerala
Ladies First Two Wheeler Workshop In Kerala

By ETV Bharat Telugu Team

Published : Nov 23, 2023, 4:57 PM IST

తొలి లేడీస్ గ్యారేజ్

Ladies First Two Wheeler Workshop In Kerala : పూర్తిగా మహిళలే నడిపించే తొలి మెకానిక్ షాప్ కేరళలో ఏర్పాటైంది. కాసర్​గోడ్​ జిల్లాకు చెందిన ముగ్గురు మహిళలు రాష్ట్రంలోనే తొలి మహిళా బైక్ మెకానిక్ షాప్​ను పెట్టి చరిత్ర సృష్టించారు. వెస్ట్ ఎలేరి పంచాయతీకి చెందిన బింటో, బిన్సీ, మెర్సీ.. 'కుటుంబశ్రీ వనితా టూ వీలర్ వర్క్ షాప్' పేరుతో దీన్ని ప్రారంభించారు. బైక్స్​ను రిపేర్ చేయించుకునేందుకు చాలా మంది వాహనదారులు ఇక్కడికి వస్తున్నారు.

బైక్​ను చెక్​ చేస్తున్న మహిళ
బైక్​ను రిపేర్​ చేస్తున్న మహిళ

కుటుంబశ్రీ ఆర్​కేఐ ఎంటర్​ప్రెన్యుర్​షిప్​ డెవలప్​మెంట్ ప్రోగ్రామ్(ఆర్​కేఐఈడీపీ) కింద తొమ్మిది మంది మహిళలు బైక్​ రిపేర్ వర్క్​లో శిక్షణ పొందారు. వారిలో బింటో, బిన్సీ, మెర్సీ.. కుటుంబశ్రీ సాయంతో వెస్ట్ ఎలేరిలోని కలికదావులో వర్క్​షాప్​ను మంగళవారం ప్రారంభించారు. బైక్​కు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా రిపేర్ చేసి ఇస్తున్నారు. ప్రారంభమైన మొదటిరోజే ఈ రిపేర్ షాప్​నకు మంచి స్పందన వచ్చింది. మహిళల పనితీరు పట్ల వాహనదారులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మహిళల బైక్ మెకానిక్ షాపు
బైక్​ రిపేర్ చేస్తూ..

"ప్రస్తుతానికి ద్విచక్ర వాహనాలను మాత్రమే రిపేర్ చేస్తున్నాం. మేము త్వరలోనే త్రీవీలర్, ఫోర్​ వీలర్​ వర్క్​షాప్​ను ప్రారంభిస్తాం. అలానే ఈ పని చేయడానికి ఆసక్తి ఉన్న మహిళలకు కుటుంబశ్రీ ప్రోగ్రామ్​ కింద శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం" అని బింటో, బెన్సీ, మెర్సీ తెలిపారు. తమ షాప్​ ప్రారంభించడానికి కావాల్సిన పరికరాలను కుటుంబశ్రీ మిషన్​ కింద అధికారులు ఉచితంగా అందించారని చెప్పారు మహిళలు. కొంత కాలం తర్వాత వీటిని తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత వాటిని కొనుగోలు చేసేందుకు రుణాలు ఇస్తారని ముగ్గురు మహిళలు పేర్కొన్నారు.

బైక్​ను రిపేర్​ చేస్తున్న మహిళలు

ఉమెన్స్​ డే స్పెషల్​- అంబులెన్స్‌కు తొలి మహిళా డ్రైవర్‌
First Women Ambulance driver: మారుతున్న కాలంలో పురుషులతో సమానంగా సత్తా చాటుకుంటున్నారు మహిళలు. అవని నుంచి అంతరిక్షం వరకు దేనిలోనూ తీసిపోమంటూ సై అంటున్నారు. అదే క్రమంలో అత్యవసర సమయాల్లో ప్రాణాలు నిలపడంలో కీలక పాత్ర పోషించే అంబులెన్స్‌కు డ్రైవర్‌గా పని చేసేందుకు సిద్ధమయ్యారు ఓ కేరళ మహిళ. మహిళా దినోత్సవం రోజునే ఆమె ఈ బాధ్యతలు చేపట్టారు. కేరళలో ప్రభుత్వ అంబులెన్స్‌కు ఈమె మొదటి మహిళా డ్రైవర్‌ కావడం విశేషం. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

భర్త మరణంతో ఒంటరై.. కష్టపడి బస్సు డ్రైవరై.. ఆదర్శంగా ప్రియాంక ప్రయాణం!

బులెట్​ బైక్​ల రిపేరింగ్​లో దిట్ట ఈ 'దియా'

ABOUT THE AUTHOR

...view details