తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టీకా 'లక్కీ డ్రా'లో ఐఫోన్​-12.. కూలీ ఇంట్లో చిరునవ్వు! - labour wins iphone 12

Labour wins Iphone 12: ఓ లక్కీ డ్రాలో.. ఓ కూలీని రూ.70వేలు విలువ చేసే ఐఫోన్​-12 వరించింది. టీకా రెండు డోసులు తీసుకున్న వారు.. అహ్మదాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ నిర్వహించిన లక్కీ డ్రాలో పాల్గొనగా.. కిషన్​భాయ్​ అనే కూలీకి ఈ ఐఫోన్​ దక్కింది. ఇక ఆయన కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.

labour wins iphone 12
టీకా 'లక్కీ డ్రా'లో ఐఫోన్​-12.. కూలీ ఇంట్లో చిరునవ్వు!

By

Published : Dec 24, 2021, 7:27 AM IST

Updated : Dec 24, 2021, 11:51 AM IST

Vaccine lucky draw Gujarat: ప్రజలు టీకాలు వేసుకునే విధంగా ప్రోత్సహించేందుకు రకరకాల వ్యూహాలు రచిస్తోంది గుజరాత్​లోని అహ్మదాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​(ఏఎమ్​సీ). ఇందులో భాగంగా ఓ లక్కీ డ్రాను ఏర్పాటు చేసింది. అందులో ఓ కూలీకి ఐఫోన్​-12 దక్కింది.

టీకా వేసుకుంటే..

ఈ ఏడాది డిసెంబర్​ 31 నాటికి నగరంలో 100శాతం వ్యాక్సినేషన్​ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏఎమ్​సీ ఆరోగ్యశాఖ. ఇందులో భాగంగా ఈ నెల 1-7 మధ్య టీకా రెండు డోసులు తీసుకున్న వారు లక్కీ డ్రాలో పాల్గొనాలని ఆహ్వానించింది.

కిషన్​భాయ్​ కుటుంబం

కొన్ని రోజులకు ఆరోగ్యశాఖ ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయింది. స్థానిక మీడియాల కథనాలు రావడం వల్ల లక్కీ డ్రా తీసేందుకు సిద్ధపడింది. ఈ క్రమంలోనే కిషన్​ భాయ్​ మక్వానాను రూ. 70వేల విలువ చేసే ఐఫోన్​-12 వరించింది.

'అసలు నమ్మలేదు..'

ఇంత ఖరీదైన బహుమతి లభించడంపై కిషన్​భాయ్​ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. తనకు లక్కీ డ్రా వచ్చిందంటే తొలుత నమ్మలేదని ఆయన వివరించారు.

"కరోనా రెండో డోసు టీకా వేసుకోవడం వల్ల నాకు ఐఫోన్​ వచ్చిందంటే నమ్మలేకపోతున్నా. తొలుత ఆ విషయాన్ని నేను నమ్మలేదు. నన్ను మోసం చేసేందుకు అలా చెబుతున్నారని అనిపించింది. అందుకే వారి ఫోన్లు ఎత్తడం కూడా మానేశాను. స్విచ్​ ఆఫ్​ చేసేశాను. కానీ టీకా తీసుకునే సమయంలో నా ఆధార్​ కార్డు ఇచ్చాను. అందులో నా ఇంటి అడ్రెస్​ కూడా ఉంది. అది చూసి ఓ రోజు అధికారులు నా ఇంటికి వచ్చారు. జరిగింది వివరించారు. చాలా సంతోషంగా ఉంది."

-- కిషన్​భాయ్​, కూలీ

vaccine lucky draw India: అయితే ఐఫోన్​ కోసం కిషన్​భాయ్​ టీకా తీసుకోలేదు. కరోనాపై పోరులో టీకాలు సమర్థంగా పనిచేస్తాయన్న నమ్మకంతోనే టీకా కేంద్రానికి వెళ్లాడు. ప్రజలు కూడా తొందరగా టీకాలు వేసుకోవాలని పిలుపునిచ్చాడు కిషన్​భాయ్​.

ఇదీ చూడండి:-టీకా వేసుకో.. బహుమతి తీసుకో.. కేంద్రం కొత్త ఆఫర్!

Last Updated : Dec 24, 2021, 11:51 AM IST

ABOUT THE AUTHOR

...view details