అదృష్టం.. ఓ కూలీ జీవితాన్ని మార్చేసింది. రాత్రికి రాత్రే అతణ్ని లక్షాధికారిని చేసింది. గనుల్లో పని చేసే ఓ వ్యక్తికి రూ.లక్షలు విలువ చేసే వజ్రం(mine labourer finds diamond) దొరికింది. వజ్రాల గనిగా ప్రసిద్ధి గాంచిన మధ్యప్రదేశ్ పన్నా జిల్లాలో(madhya pradesh panna news) ఈ సంఘటన జరిగింది.
పన్నా జిల్లాలో(panna diamond mines) హీరాపుర్ తపరియన్ ప్రాంతంలోని గనుల్లో పని చేసే శంశేర్ ఖాన్ అనే వ్యక్తికి ఈ వజ్రం లభించింది. 6 క్యారెట్ల 66 సెంట్ల బరువుతో ఉన్న ఈ వజ్రం ధర రూ.20 లక్షలుగా ఉంటుందని అంచనా. ఈ వజ్రాన్ని ఇప్పుడు అతడు వేలం వేసేందుకు ప్రభుత్వ అధికారులకు అప్పగించాడు.
'శ్రమ ఫలించింది'
తాను ఎన్నో గనుల్లో వజ్రాల కోసం వెతికానని తెలిపాడు శంశేర్ ఖాన్. అయితే.. ఇప్పుడు తన శ్రమ ఫలించి, తనకు వజ్రం దొరికిందని సంతోషం వ్యక్తం చేశాడు.
"హీరాపుర్ తపరియన్ ప్రాంతంలోని గనిలో నాకు ఈ వజ్రం లభించింది. ఇది ఆరున్నర క్యారెట్లుగా ఉంది. ఇది దొరకడం పట్ల నాకెంతో సంతోషంగా ఉంది. ఈ వజ్రాన్ని వేలం వేయడం ద్వారా వచ్చే డబ్బులను నేను నా వ్యాపారం కోసం వినియోగిస్తాను. ఈ డబ్బులతో నా కుటుంబ జీవితాన్ని మార్చుతాను."
-శంశేర్ ఖాన్, గనిలో పని చేసే వ్యక్తి.