తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కుంభమేళాలో భక్తుల సంఖ్య పరిమితంగా ఉండాలి'

కుంభమేళాలో పాల్గొనే భక్తుల సంఖ్య కొవిడ్ వ్యాప్తికి దారితీయకుండా లాంఛనప్రాయంగా ఉండాలని కోరారు ప్రధాని నరేంద్ర మోదీ. వైరస్​ బారిన పడిన సాధువుల ఆరోగ్య పరిస్థితుల గురించి జునా అఖాడా ఆచార్యులు స్వామి అవదేశానందగిరిని ఫోన్​లో అడిగి తెలుసుకున్నారు.

PM Modi
నరేంద్ర మోదీ

By

Published : Apr 17, 2021, 10:29 AM IST

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ కుంభమేళాలో పాల్గొనే భక్తుల సంఖ్య కొవిడ్ వ్యాప్తికి దారితీయకుండా లాంఛనప్రాయంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. జునా అఖాడాకు చెందిన స్వామి అవదేశానందగిరితో ఫోన్లో మాట్లాడినట్లు పేర్కొన్న మోదీ.. వైరస్ బారినపడిన సాధువుల ఆరోగ్యంపై ఆరా తీసినట్లు తెలిపారు.

కుంభమేళా సందర్భంగా హరిద్వార్‌లో స్థానిక యంత్రాంగానికి అఖాడాలు సహకరించిన తీరును ప్రధాని కొనియాడారు. రెండు షాహీ స్నానాలు ముగిసినందున కుంభమేళాతో కొవిడ్ వ్యాప్తికి దారితీయకుండా భక్తుల సంఖ్య పరిమితంగా ఉండాలని ఆయన సూచించారు.

30 వరకు..

ఏప్రిల్‌ 1న మొదలైన కుంభమేళా ఈనెల 30వరకూ జరగనుంది. కొవిడ్‌ కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న వేళ దేశం నలుమూలల నుంచి కుంభమేళాకు భారీ సంఖ్యలో ప్రజల హాజరుపై విమర్శలు చెలరేగాయి. కుంభమేళాకు హాజరైన అనేక మందికి కొవిడ్‌ సోకినట్లు నిర్ధరణ అయ్యింది.

ఇదీ చదవండి: కరోనా పంజా- కొత్తగా 2 లక్షల 34 వేల కేసులు

ఇదీ చదవండి: అందరికీ టీకా అందేదెప్పుడు?

ABOUT THE AUTHOR

...view details