ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని కుంభమేళాలో పుష్కర ఘాట్లు సోమవారం.. 'హరహర మాహాదేవ్', 'గంగా మాతాకీ జై' నినాదాలతో హోరెత్తాయి. కుంభమేళలో భాగంగా 'హర్ కీ పౌరీ' ఘాట్ వద్ద సోమవారం అఘోరాలు, సాధువులు, భక్తులు రెండో షాహీ స్నానాలు చేశారు. అయితే.. కరోనా విజృంభిస్తున్న వేళ వేలాది మంది పుణ్యస్నానాలకు హాజరవటంపై ఆందోళన వ్యక్తం చేశారు అధికారులు.
భారీ మొత్తంలో జనం హాజరవుతుండగా.. భౌతిక దూరం పాటించటం సాధ్యం కాదని కుంభమేళా జనరల్ ఐజీ సంజయ్ గుంజ్యాల్ తెలిపారు. భౌతిక దూరం పాటించేందుకు ప్రయత్నిస్తే.. తొక్కిసలాట జరిగే ప్రమాదముందని చెప్పారు.
రెండో షాహీ స్నానాలు ఆచరించేందుకు.. నేపాల్ రాజు జ్ఞానేంద్ర వీర్ విక్రమ్ సింగ్ ఆదివారం హరిద్వార్‌కు చేరుకున్నారు.