హరిద్వార్‌లో జరగనున్న కుంభమేళాపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుంభమేళా నిర్వహణ 30 రోజులకే పరిమితం చేస్తున్నామని ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు జరుగుతుందని వెల్లడించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాశ్ గురువారం స్పష్టం చేశారు.
"కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి నెలాఖరులోగా ఈ విషయంపై నోటీసులు జారీ చేస్తాం."
-ఓం ప్రకాశ్, ప్రధాన కార్యదర్శి
యాత్రికులకు పాసులు తప్పనిసరి చేస్తున్నట్టు.. అవి ఉన్న వారికే అనుమతి ఇవ్వనున్నట్టు అధికారులు వెల్లడించారు.
"ఉత్సవాల్లో పాల్గొనే యాత్రికులకు పాసులను తప్పనిసరి చేస్తున్నాం. కొవిడ్ పరీక్షలు చేయించుకుని, నెగెటివ్ రిపోర్ట్‌ను సమర్పించాలి. అప్పుడే వారిని అనుమతిస్తాం. భద్రత కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. కుంభమేళా వద్ద విధులు నిర్వహించే సిబ్బంది రక్షణ కోసం 70వేల కొవిడ్ టీకా డోసులు కావాలని ప్రభుత్వాన్ని కోరాము."
-సి. రవిశంకర్, హరిద్వార్ జిల్లా మెజిస్ట్రేట్
ఇదీ చూడండి :షా పర్యటనకు ముందు బంగాల్లో ఉద్రిక్తత