తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Kumaraswamy Health Condition : 'ఇది నాకు మూడో జన్మ.. దాన్ని తేలికగా తీసుకోవద్దు' - ఆస్పత్రి నుంచి కుమారస్వామి డిశ్చార్జ్

Kumaraswamy Health Condition : కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్​డీ కుమారస్వామి ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యారు. ఇది తనకు దేవుడిచ్చిన మూడో జన్మ అని భావోద్వేగానికి గురయ్యారు.

Kumaraswamy Health Condition
Kumaraswamy Health Condition

By ETV Bharat Telugu Team

Published : Sep 3, 2023, 3:23 PM IST

Updated : Sep 3, 2023, 3:53 PM IST

Kumaraswamy Health Condition :ఇది తనకు మూడో జన్మ అని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతా దళ్​(సెక్యులర్) నేత హెచ్​డీ కుమారస్వామి భావోద్వేగానికి గురయ్యారు. అనారోగ్యంతో ఇటీవల ఆస్పత్రిలో చేరిన ఆయన ఆదివారం డిశ్చార్జ్​ అయ్యారు. ఈ సందర్భంగా తనకు చికిత్స చేసిన వైద్యులకు, దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజల మధ్య ఉండేందుకు తాను కొత్త జీవితం పొందానని అన్నారు. పక్షవాతం, పక్షవాత లక్షణాలను తేలికగా తీసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

'నా ఆరోగ్య పరిస్థితి గురించి గత కొద్ది రోజులుగా నా స్నేహితులు భయపడుతున్నారు. నేను మీతో మాట్లాడుతున్నానంటే.. నాకు పునర్జన్మ వచ్చిందనే చెప్పాలి. ప్రతి వ్యక్తికి ఒక జన్మ ఉంటే.. నా విషయంలో 64 ఏళ్ల వయసులో దేవుడు నాకు మూడో జన్మ ఇచ్చాడు' అని కుమార స్వామి భావోద్వేగానికి గురయ్యారు.
అలసట, జ్వరంతో బాధపడిన కుమార స్వామి బుధవారం (2023 ఆగస్టు 30) తెల్లవారుజామున అత్యవసరంగా హాస్పిటల్​లో అడ్మిట్​ అయ్యారు. బెంగళూరులోని జయనగర్.. అపోలో స్పెషాలిటీ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందారు.

డిశ్చార్జ్​ తర్వాత మీడియా సమావేశంలో కుమారస్వామి

Hd Kumaraswamy Heart Surgery :అంతుకుముందు కుమారస్వామికి మేజర్ హార్ట్​ సర్జరీ జరిగింది. ఆ తర్వాత ఇలా అనారోగ్యం బారిన పడటం వల్ల కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే సర్జరీకి, ఇప్పటి ఆరోగ్య పరిస్థితికి ఎలాంటి సంబంధం లేదని వైద్యులు నిర్ధరించారు. దీంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. వారం రోజులుగా వివిధ కార్యక్రమాల్లో విశ్రాంతి లేకుండా కుమారస్వామి గడిపారని.. అందుకే ఇలా జరిగి ఉండొచ్చని కార్యకర్తలు అభిప్రాయపడ్డారు.

అప్పుడూ ఇలాగే..!
ఈ ఏడాది మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలసమయంలోనూ కుమారస్వామి అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారు. బెంగళూరు పాత విమానాశ్రయానికి సమీపంలో ఉన్న మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. దీంతో ఎన్నికల ప్రచారానికి కొన్ని రోజులపాటు ఆయన దూరంగా ఉన్నారు. అయితే కుమారస్వామి అలసట, సాధారణ బలహీనతతోనే ఆస్పత్రిలో చేరినట్లు అప్పుడు వైద్యులు తెలిపారు. విరామం లేకుండా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనటమే అనారోగ్యానికి కారణమని వెల్లడించారు. ఆయన్ను కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.పూర్తి కథనం కోసం ఇక్కడి క్లిక్ చేయండి.

HD Kumaraswamy Health : కుమారస్వామికి అనారోగ్యం.. హడావుడిగా అస్పత్రికి తరలింపు.. వైద్యుల కీలక ప్రకటన

'కర్ణాటకలోనూ ఓ అజిత్​ పవార్​ పుట్టుకురావచ్చు.. 5 నెలల్లో భారీ మార్పులు!'

Last Updated : Sep 3, 2023, 3:53 PM IST

ABOUT THE AUTHOR

...view details