జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. కుల్గాం జిల్లాలో ఒక ఉగ్రవాదిని బీఎస్ఎఫ్ బలగాలు మట్టుబెట్టగా.. ముష్కరుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. మరో ఇద్దరు పౌరులు సైతం ఎదురు కాల్పుల్లో గాయపడినట్లు కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ విజయ్ కుమార్ అన్నారు.
కశ్మీర్లో ఎన్కౌంటర్- ఉగ్రవాది హతం - కశ్మీర్ ఎన్కౌంటర్
కశ్మీర్‌లోని కుల్గామ్‌లో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
గురువారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో మాల్‌పొరా మిర్ బజార్‌లోని జాతీయ రహదారిపై.. బలగాలతో వెళ్తున్న బీఎస్ఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భారత బలగాలు ఎదురు కాల్పులు జరపడం వల్ల వారు పరారయ్యారు. అయితే కాల్పులకు తెగబడిన ఇద్దరు ముష్కరులు అక్కడే ఓ భవనంలో దాక్కున్నట్లు బలగాలు గుర్తించాయి. ఈ క్రమంలో వారిని పట్టుకునేందుకు బలగాలు వెళ్లగా.. ముష్కరులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. అటు సైన్యం దీటుగా బదులివ్వడం వల్ల లష్కరే తోయిబాకు చెందిన ఓ ఉగ్రవాది హతమయ్యాడు.
ఇదీ చదవండి:కశ్మీర్లో జవాన్ల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి