KTR Fell from the Top of the Campaign Chariot in Armoor : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో నిర్వహించిన బీఆర్ఎన్ నామినేషన్ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. పార్టీ శ్రేణులు ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి బయల్దేరారు. కేటీఆర్, ఇతర నేతలు ప్రచార వాహనంపై వెళ్లారు. ఈ క్రమంలో వాహన డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో కేటీఆర్, ఎంపీ సురేశ్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రచార రథం పైనుంచి ముందుకు పడ్డారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కేటీఆర్‌ను కిందపడకుండా పట్టుకోగా.. పట్టుకోల్పోయిన ఎంపీ సురేశ్ రెడ్డి మాత్రం కిందపడిపోయారు.
ఆర్మూర్‌లో ప్రచార రథం పైనుంచి ముందుకు పడిన కేటీఆర్ - స్వల్ప గాయాలు
Published : Nov 9, 2023, 2:50 PM IST
|Updated : Nov 9, 2023, 3:31 PM IST
14:49 November 09
ఆర్మూర్‌లో ప్రచార రథం పైనుంచి ముందుకు పడిన కేటీఆర్ - స్వల్ప గాయాలు
సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య - తప్పిన ప్రమాదం
సడన్ బ్రేక్‌తో వాహన గ్రిల్ ఊడిపోవడంతో నేతలంతా కిందపడబోయారు. ఘటనలో సురేశ్ రెడ్డితో పాటు మంత్రి కేటీఆర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆర్మూర్ పట్టణంలోని పాత ఆలూర్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం నామినేషన్ వేసేందుకు కేటీఆర్, నేతలు వెళ్లారు. ఎవరికీ ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదన్న కేటీఆర్.. తన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అనంతరం ఆర్మూర్ నుంచి కొడంగల్ రోడ్ షోలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు.