మసీదు, దర్గాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై కర్ణాటక వక్ఫ్ బోర్డు ఆంక్షలు విధించింది. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు ఎలాంటి స్పీకర్లను వినియోగించరాదని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరిస్తూ ఈనెల 9న ఉత్తర్వులు జారీ చేసింది.
"మసీదులు, దర్గాల్లో వినియోగించే లౌడ్ స్పీకర్ల కారణంగా సమీప ప్రాంతాల్లో నివసించే ప్రజల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని గుర్తించాము. ఈ విషయంపై 2017 జులై 10న తొలిసారి ప్రకటన విడుదల చేశాము. ఆజాన్కు మాత్రమే లౌడ్స్పీకర్ల వినియోగానికి అనుమతిస్తున్నాము."
-కర్ణాటక వక్ఫ్ బోర్డు