తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Krishnashtami 2023 Sep 6th or 7th ? : శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు.. సెప్టెంబర్​ 6నా..? 7వ తేదీనా..?

Krishnashtami 2023 Correct Date: కృష్ణాష్టమి గడియలు సమీపిస్తున్నాయి. అయితే.. ఏ రోజున ఈ పర్వదినాన్ని జరుపుకోవాలి? అనే విషయమై భక్తుల్లో కొంత గందరగోళం నెలకొంది. మరి.. శ్రీ కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి..? ఈ సమస్య రావడానికి గల కారణాలు ఏంటి..? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

Krishnashtami 2023 Correct Date
Krishnashtami 2023 Sep 6th or 7th ?

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2023, 5:02 PM IST

Updated : Sep 5, 2023, 1:18 PM IST

Krishnashtami 2023 Correct Date Details :"ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే" అంటూ శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తారని హిందువులు విశ్వసిస్తారు. ఆ పది అవతారాల్లో 8వ అవతారంగా ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడిగా జన్మించాడని పురాణోక్తి. అలా కృష్ణుడు పుట్టిన రోజునే.. శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటారు. ఈ పర్వదినాన్నే.. "కృష్ణాష్టమి", "గోకులాష్టమి" ఇంకా.. "అష్టమి రోహిణి" అని కూడా పిలుస్తారు. హిందువులు శ్రీ కృష్ణ జన్మాష్టమిని చాలా ఘనంగా జరుపుకుంటారు. ప్రతీ సంవత్సరం శ్రావణ మాసం కృష్ణ పక్షంలోని అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో మురారి జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తారు. అయితే.. ఈ సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి ఏ రోజు వచ్చింది? ఏ రోజున జరుపుకోవాలి? అనే విషయంలో చాలా మందికి స్పష్టత లేదు. మరి, దానికి కారణం ఏంటి? అసలు జన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి? అన్నది తెలుసుకుందాం.

జన్మాష్టమి ఎప్పుడు?:

When Krishnashtami in 2023:ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమిని సెప్టెంబరు 06న జరుపుకోవాలని కొందరు చెబుతున్నారు. లేదు లేదు.. సెప్టెంబరు 07న జరుపుకోవాలి అన్నది మరికొందరి భావన. ఈ పరిస్థితి కారణం ఏమంటే.. ఆ తిథి రెండు రోజులనూ కలుపుతూ వచ్చింది. వైదిక క్యాలెండర్ ప్రకారం.. జన్మాష్టమి కృష్ణ పక్షం అష్టమి తిథి సెప్టెంబర్ 06న మధ్యాహ్నం 03:27 గంటలకు ప్రారంభమై.. సెప్టెంబర్ 07న సాయంత్రం 04:14 గంటలకు ముగుస్తుంది. ఇక.. రోహిణి నక్షత్రం సెప్టెంబర్ 6 ఉదయం 09.20 నుంచి మెుదలై.. సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 10.25 వరకు ఉంటుంది. దీంతో.. స్మార్త సంప్రదాయం అనుసరించేవారు సెప్టెంబరు 06న జన్మాష్టమిని జరుపుకోవాలి అంటున్నారు. వైష్ణవులు సెప్టెంబరు 07న నిర్వహించాలని సూచిస్తున్నారు. అయితే.. పండితులు ఏమంటున్నారంటే.. సెప్టెంబర్ 6న జన్మాష్టమి వేడుకలు, సెప్టెంబర్ 7న ఉట్టికొట్టే ఉత్సవం నిర్వహించాలని సూచిస్తున్నారు.

దృక్ పంచాంగం ప్రకారం:

According to Drik Panchangam: పూజ సమయం సెప్టెంబర్ 7 రాత్రి 11:57 నుంచి 12:42 వరకు ఉంటుంది. అందువల్ల జన్మాష్టమి నాడు పూజకు శుభ సమయం రాత్రి 11:57 గంటలకు ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి 12.42 గంటల వరకు లడ్డూ గోపాల్ జయంతి, పూజలు ఉంటాయి. ఉట్టికొట్టే సమయం సెప్టెంబర్ 7 సాయంత్రం 4:14 గంటలకు ఉంటుంది. ఈ రోజున శ్రీకృష్ణుని భక్తులు ఆ దేవదేవుడి రూపాన్ని బాల్ గోపాల్, లడ్డూ గోపాల్ అని పిలుస్తారు. వైదిక కాలగణన ప్రకారం, ఈ సంవత్సరం శ్రీకృష్ణుని 5250వ జన్మదినోత్సవం.

ఉపవాస దీక్షలు .. కృష్ణాష్టమి నాడు భక్తులు వారి ఇళ్లను అలంకరిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. పగలంతా ఉపవాసం ఉండి, సాయం కాలం శ్రీ కృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్లు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ, రుచికరమైన వంటకాలు తయారు చేసి స్వామికి నైవేద్యం పెడతారు. శ్రీకృష్ణుని విగ్రహాన్ని అలంకరించి.. ఊయలలు కట్టి అందులో పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ‘ఉట్ల పండుగ లేదా ‘ఉట్ల తిరునాళ్లు' అని పిలుస్తారు. అయితే.. కృష్ణాష్టమి వేడుకలు.. ఉత్తరప్రదేశ్​ రాష్ట్రం మధుర-బృందావనంలో జరుగుతాయి. ఇక్కడ కృష్ణుడు జన్మించాడని, అతని బాల్యాన్ని ఎక్కువుగా ఇక్కడే గడిపాడని ప్రసిద్ధి.

Last Updated : Sep 5, 2023, 1:18 PM IST

ABOUT THE AUTHOR

...view details