కేరళకు చెందిన ఓ వ్యక్తి సైకిల్ యాత్ర చేపట్టి ఇంధన రేట్లపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోజికోడ్ నుంచి ఏకంగా.. నేపాల్‌కు సైకిల్‌పై బయల్దేరారు అఖిలేశ్.
కోజికోడ్ టు నేపాల్..
కోజికోడ్ జిల్లా వేల్లిమడుకున్ను పూలక్కడవుకు చెందిన అఖిలేశ్.. ఫిజికల్ ట్రైనింగ్ టీచర్‌గా పనిచేస్తున్నారు. దేశంలో ఇంధన రేట్లు పెరడటంపై ఆయన ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే ఇలా సైకిలెక్కి నిరసన బాటపట్టారు. నిరసన అనేది కేవలం రాజకీయ నాయకులు, పార్టీలకే కాదని.. ప్రతి పౌరుడి బాధ్యత అనే సందేశమిచ్చేందుకే ఇలా చేస్తున్నానని చెప్పారు అఖిలేశ్.