తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుడ్లు పెట్టడంలో కోడిపెట్ట కొత్త రికార్డ్! - ఎక్కువ గుడ్లు పెట్టిన కోడిపెట్ట

కోడిపెట్ట రోజులో ఒక గుడ్డు పెడుతుంది. అప్పుడప్పుడు రోజులో రెండు గుడ్లు పెడుతుంది. కానీ, కేరళ కోజికోడ్​కు​ చెందిన ఓ వ్యక్తి ఇంట్లోని కోడిపెట్ట మాత్రం అందరినీ ఆశ్యర్యపరిచింది. ఆ కోడి ఎన్ని గుడ్లు పెట్టిందంటే..

eggs, kozhikode
కోడిగుడ్డు, కోజికోడ్

By

Published : Jun 27, 2021, 4:17 PM IST

ఒకేరోజులో 11 గుడ్లు పెట్టిన కోడిపెట్ట

ఒక రోజులో ఓ కోడిపెట్ట ఎన్ని గుడ్లు పెడుతుంది?. ఒకటి.. మహా అయితే రెండు. కానీ, కేరళ కోజికోడ్​లోని బాలుస్సెరీలో ఓ కోడిపెట్ట.. ఒకే రోజులో ఏకంగా 11 గుడ్లు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.

అరగంటకు ఒకటి..

కొలత్తూరుకు చెందిన మనోజ్​ అనే వ్యక్తి ఇంట్లో గత గురువారం ఈ సంఘటన జరిగింది. ఉదయం 7 గంటల నుంచి ఒంటిగంట మధ్య అర గంటకోసారి కోడిపెట్ట గుడ్డు పెట్టినట్లు మనోజ్ తెలిపారు. నాలుగు నెలల కిందట తన బంధువుల ఇంటి నుంచి ఈ కోడిని తెచ్చుకున్నట్లు వెల్లడించారు.

అయితే.. హార్మోన్ల ప్రభావం వల్లే కోడిపెట్ట అన్ని గుడ్లు పెడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:మెడ కింద నుంచి గుడ్డు పెట్టే వింత కోడిపెట్ట!

ABOUT THE AUTHOR

...view details