తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మలద్వారంలో కిలో బంగారం.. క్యాప్సుల్స్​లో నింపి..

మలద్వారంలో క్యాప్సుల్స్​ రూపంలో అక్రమంగా తరలిస్తున్న కిలో బంగారాన్ని కస్టమ్స్​ అధికారులు.. కేరళలోని కొచ్చి ఎయిర్​పోర్ట్​లో స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, ముంబయిలో రూ.7.87 కోట్ల విలువైన బంగారాన్ని అధికారులు సీజ్​ చేశారు.

Mumbai Airport Customs seized 15 kg of gold
kozhikode gold smuggling case

By

Published : Oct 13, 2022, 1:59 PM IST

Updated : Oct 13, 2022, 2:17 PM IST

కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో మలద్వారంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. నిందితుడు బంగారాన్ని నాలుగు క్యాప్సుల్స్​లో నింపి.. మలద్వారంలో దాచుకొని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

క్యాప్సుల్స్​లో పట్టుబడ్డ బంగారం

పోలీసుల వివరాల ప్రకారం..కొజికోడ్​ జిల్లాకు చెందిన కొడువాలి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవలే దోహ వెళ్లాడు. అక్కడ నుంచి ఇండిగో ఫ్లైట్​లో బుధవారం కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఆ సమయంలో అతడిపై అధికారులకు అనుమానం వచ్చింది. అదుపులోకి తీసుకుని సోదాలు చేపట్టారు. మలద్వారంలో నాలుగు క్యాప్సుల్స్​ రూపంలో​ బంగారం తరలిస్తున్నట్లు గుర్తించారు. సుమారు 1066.75 గ్రాముల బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు యత్నించాడని కస్టమ్స్​ అధికారులు తెలిపారు.

రూ.7.87 కోట్ల విలువైన బంగారం సీజ్​..
మహారాష్ట్రలోని ముంబయిలో నాలుగు వేర్వేరు ఘటనల్లో సుమారు 15 కేజీల బంగారాన్ని కస్టమ్స్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్టోబరు 11,12 తేదీల్లో చేపట్టిన సోదాల్లో సీజ్​ చేసి బంగారం సుమారు 7.87 కోట్ల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. మరో రెండు ఘటనలో రూ.22 లక్షలు విలువైన విదేశీ కరెన్సీని సీజ్​ చేశారు. ఈ ఘటన ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ముంబయిలో పట్టుబడ్డ బంగారం

ఇదీ చదవండి:జాతరలో బోర్ కొట్టి చెరువు గట్టున వాకింగ్.. వజ్రం దొరికి రాత్రికి రాత్రే లక్షాధికారిగా...

మరో దారుణం.. బాలికను నరబలి ఇచ్చిన దుండగులు.. తండ్రికి తెలిసే జరిగిందా?

Last Updated : Oct 13, 2022, 2:17 PM IST

ABOUT THE AUTHOR

...view details