మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు వలస కూలీలు. ఈ ఘటన కేరళలోని కోజీకోడ్‌లో జరిగింది. నిందితులందరినీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 16 ఏళ్ల బాలికకు రైలు ప్రయాణంలో ప్రధాన నిందితుడితో పరిచయం ఏర్పడింది. ఆమె తన సోదరిని కలవడానికి వారణాసి నుంచి చెన్నైకి వెళ్తోంది. అయితే నిందితుడు.. బాధితురాలికి మాయమాటలు చెప్పి ఆమెను చెన్నైలో దిగకుండా చేశాడు. అనంతరం తనతో కలిసి పాలక్కడ్ తీసుకెళ్లాడు. అక్కడి నుంచి ఆమెతో కలిసి కోజీకోడ్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత బాధితురాల్ని పాళయంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి మరో ముగ్గురితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాల్ని కోజీకోడ్ రైల్వే స్టేషన్ పట్టాల దగ్గర వదిలేసి పరారయ్యారు. ప్రధాన నిందితుడు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వ్యక్తేనని పోలీసులు తెలిపారు.
టీనేజర్‌పై దారుణం..
ఉత్తర్‌ప్రదేశ్ ప్రతాప్‌గఢ్‌లో దారుణం జరిగింది. ఓ టీనేజర్‌పై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన దెల్హపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లింది బాధితురాలు. అయితే గజేడ అటవీ ప్రాంతంలో మరో ఇద్దరితో కలిసి టీనేజర్ స్నేహితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం దారుణాన్ని వీడియో తీశాడు. అత్యాచారం జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బాధితురాల్ని బెదిరించాడు. అనంతరం బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే నిందితులు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. రోడ్డుపక్కన ఉన్న బాలికను చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాలికను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేశామని.. పరారీలో ఉన్న మరొకరిని నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
కోడలినే చంపిన మామ..
సొంత కోడలినే హతమార్చాడు ఓ వ్యక్తి. ఈ ఘటన పంజాబ్ లుధియానాలోని సీఎంసీ కాలనీలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. నిందితుడిని అరవింద్‌గా పోలీసులు గుర్తించారు. ఇంటి స్థలం విషయంలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. బాధితురాలిపై నిందితుడు కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అడ్డుకునేందుకు ఆమె భర్త అడ్డుపడగా.. అతడిపై కూడా దాడిచేశారని తెలిపారు.