తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నడిరోడ్డుపై కొరియన్​ యూట్యూబర్​కు వేధింపులు.. నిందితులు అరెస్ట్ - కొరియన్​ యూట్యూబర్ హరాస్​మెంట్​

ముంబయిలో నడిరోడ్డుపై ఓ మహిళా యూట్యూబర్‌ వేధింపులకు గురయ్యారు. దీంతో ముంబయి పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

KOKREAN YOUTUBER HARASSED
KOKREAN YOUTUBER HARASSED

By

Published : Dec 1, 2022, 12:34 PM IST

దక్షిణ కొరియాకు చెందిన ఓ యూట్యూబర్‌ ముంబయిలోని ఓ వీధిలో లైవ్‌స్ట్రీమింగ్‌ చేస్తుండగా బహిరంగంగానే వేధింపులకు గురైంది. ఆకతాయిలు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఇదీ జరిగింది...
మయోచి అనే యూట్యూబర్‌ మంగళవారం రాత్రి ముంబయిలోని రద్దీగా ఉన్న ఓ వీధిలో లైవ్‌స్ట్రీమ్‌ చేస్తోంది. ఆ సమయంలో అక్కడ వందల మంది తిరుగుతున్నారు. అప్పుడు ఇద్దరు యువకులు బైక్‌పై అక్కడకు వచ్చి లిఫ్ట్‌ ఇస్తామంటూ ఆమె చెయ్యి పట్టుకొని బలవంతంగా లాగారు. ఆమెకు ఏమి చేయాలో అర్థం కాక 'ఇంటికి వెళ్లాలని' వారిని వారిస్తూ వెళ్లిపోబోయింది. అంతలో ఓ యువకుడు ఆమెని ముద్దుపెట్టుకోబోయాడు. అతడిని వదిలించుకొని మయోచి ముందుకు వెళ్లిపోయింది. అప్పటికీ ఆ యువకులు ఆమెను వదల్లేదు. ఓ స్కూటర్‌పై ఆమె వెనుకే వచ్చి మళ్లీ వాహనం ఎక్కాలంటూ బలవంతం చేశారు. కానీ, ఆమె నిరాకరించింది.

పోలీసుల అదుపులో నిందితులు

ఈ వీడియోను ఆదిత్య అనే వ్యక్తి ట్వీట్‌ చేశారు. దీనిని మయోచి రీట్వీట్‌ చేస్తూ.. "అక్కడ ఓ యువకుడు నన్ను వేధించాడు. విషయం పెద్దది కాకముందే అక్కడి నుంచి వచ్చేశాను. ఎందుకంటే వారు ఇద్దరు ఉన్నారు. నేను స్నేహపూర్వకంగా సంభాషించడం వల్లే ఇలా జరిగిందని కొందరు అంటున్నారు. ఈ ఘటనతో ఇక, నేను వీధుల్లో లైవ్‌స్ట్రీమ్‌ చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలేమో" అంటూ ఆమె ట్వీట్‌ చేశారు. దీనికి ముంబయి పోలీసులు ట్విటర్‌ వేదికగా స్పందించారు. "మీరు చెప్పిన దానిని పరిశీలిస్తాం. మీరు నేరుగా మాకు సమాచారం పంపండి" అని ట్వీట్‌ చేశారు. దీనికి మయోచి స్పందిస్తూ.. "మీకు సందేశం పంపే మార్గం నాకు కనిపించలేదు. మీరు నేరుగా సందేశం పంపండి. దాని ఆధారంగా మీకు అవసరమైన సమాచారం ఇవ్వగలను" అని ట్వీట్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details