కోర్టు ప్రాంగణంలో వాదోపవాదలు విన్న తర్వాత.. న్యాయమూర్తి తీర్పులు చెప్పటం సర్వసాధారణం. అయితే.. ఓ న్యాయమూర్తి.. తమ ముందుకు రాలేని దివ్యాంగుడి కారు వద్దకే వెళ్లి తీర్పు చెప్పారు. ఈ సంఘటన ఛత్తీస్గఢ్ కొర్బా జిల్లాలో జరిగింది.
జిల్లా కేంద్రంలో శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ క్రమంలో ధర్మాసనం ముందుకు ఓ దివ్యాంగుడి కేసు వచ్చింది. అయితే.. అక్కడి వరకు రాలేని పిటిషనర్ ఇబ్బందిని గుర్తించిన జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీపీ వర్మ.. దివ్యాంగుడి కారు వద్దకే వచ్చి విషయం తెలుసుకున్నారు. అతని కేసుకు సంబంధించిన పత్రాలు అక్కడికే తెప్పించుకున్నారు. కేసుకు సంబంధించిన వారందరిని కారు వద్దకే రమ్మని ఆదేశించారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత బీమా సంస్థ, పిటిషనర్ల మధ్య సయోధ్య కుదిర్చారు. ఇరువురి మధ్య ఓ ఒప్పందం కుదిరిన క్రమంలో.. రోడ్డుపైనే తీర్పు చెప్పారు. బాధితుడికి బీమా కంపెనీ రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు.
కేసు ఏమిటి?