తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. ఏడుగురు మృతి.. 12 మందికి గాయాలు - కోర్బా రోడ్డు యాక్సిడెంట్

ఆగి ఉన్న ట్రక్కును మెట్రో బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది గాయపడ్డారు..

Etv Bharat
Etv Bharat

By

Published : Sep 12, 2022, 10:03 AM IST

Updated : Sep 12, 2022, 12:12 PM IST

ఛత్తీస్​గఢ్​ కోర్బా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రక్కును మెట్రో బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది గాయపడ్డారు. సోమవారం వేకువజామున 4 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. క్షతగాత్రుల్ని హైవే పెట్రోలింగ్ సిబ్బంది.. అంబులెన్స్​లో ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రాయ్​పుర్​ నుంచి సీతాపుర్​కు మెట్రో బస్సు వెళ్తుండగా పొండి ఉపోర్దా హైవేపై ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు.

ప్రమాదానికి గురైన బస్సు

మృతదేహాలను స్థానిక కమ్యూనిటీ సెంటర్​కు తరలించారు పోలీసులు. క్షతగాత్రులకు స్థానికులు సహాయం చేశారు. ప్రమాదానికి గురైన బస్సును బాంగో పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదని తెలిపారు.

Last Updated : Sep 12, 2022, 12:12 PM IST

ABOUT THE AUTHOR

...view details