కర్ణాటకలోని కొప్పాల జిల్లా అంతర్జాతీయ గుర్తింపు పొందింది. 'కిన్నాల్ హస్తకళా' నైపుణ్యానికి నెలవైన కిన్నాల గ్రామ ఖ్యాతి మరింత పెరగనుంది. ఈ నెల 27న జరిగే వెబినార్‌లో పాల్గొనేందుకు 15 మంది కిన్నాల్ కళాకారులు ఎంపికయ్యారు. వీరంతా.. దిల్లీలో నిర్వహించబోయే బొమ్మల ఆన్లైన్ ప్రదర్శన, విక్రయాల్లో పాల్గొంటారు. డిజిటల్ వేదిక ద్వారా కిన్నాల చారిత్రక వారసత్వం అంతర్జాతీయంగా ఆవిష్కృతం కానుంది.
కళకు గుర్తింపు..
దిల్లీలో ఈ నెల 27 నుంచి నాలుగు రోజులపాటు నిర్వహించబోయే వెబినార్‌లో ఈ కళకు ప్రత్యేక స్థానం కల్పించారు. తద్వారా ఈ కళకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భిన్న కళాకారులతో కిన్నాల్ కళాకారులు వేదిక పంచుకోనున్నారు.
ఈ వెబినార్కి ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోదీ.. కిన్నాల్ కళాకారులతో ప్రత్యేకంగా చర్చించనున్నట్టు సమాచారం.
పురాతన కళ..
పురాతన కళ అయిన చెక్కబొమ్మల తయారీకి కిన్నాల గ్రామం ప్రసిద్ధి. ఈ బొమ్మలను తయారు చేసేవారిని 'చిత్రగరస్' అంటారు. కర్ణాటకలోని ప్రసిద్ధ ఆలయాల్లోని కుడ్య చిత్రాలు, హంపిలోని చెక్క రథంపై ఉన్న క్లిష్టమైన శిల్పాలు తమ పూర్వీకుల పనితనానికి నిదర్శనమని కిన్నాల్ కళాకారులు చెబుతారు.
చేతులు లేకున్నా.. కాళ్లతో రాస్తూ ఇంటర్లో టాపర్
కళ్లకు గంతలతో పజిల్ పూర్తి..13 ఏళ్లకే రికార్డులు
అంతర్జాతీయ స్థాయిలో..