Rajagopal Reddy meets Ponguleti : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం ఇప్పటినుంచే వేడెక్కింది. ఎన్నికలు అంటేనే పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలతో బరిలో దిగుతాయి. ప్రజల్ని తమవైపు తిప్పుకునేందుకు అస్త్రశస్త్రాల్ని ప్రయోగిస్తుంటాయి. ఇలానే అసెంబ్లీ సమరం ముంగిట నిలిచిన తెలంగాణలో జనం నాడీపట్టేందుకు పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటలతూటలు పేలుతున్నాయి. కర్ణాటకలో గెలుపుతో మంచి ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్‌లో... జూలై 2న ఖమ్మంలో జరిగిన రాహుల్ సభ మరింత జోష్ నింపిందనే చెప్పుకోవచ్చు.
Rajagopal Reddy meets Ponguleti : కాంగ్రెస్‌లోకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.? - పొంగులేటితో భేటీ అయిన రాజగోపాల్‌రెడ్డి
![Rajagopal Reddy meets Ponguleti : కాంగ్రెస్‌లోకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.? Rajagopal Reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-07-2023/1200-675-18912482-114-18912482-1688469578933.jpg)
16:35 July 04
Rajagopal Reddy meets Ponguleti : కాంగ్రెస్‌లోకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.?
RajagopalReddy Latest News : ఖమ్మంలో జరిగిన ఈ సక్షలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఖమ్మంలో జరిగిన తెలంగాణ జన గర్జన సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. పొంగులేటితో పాటు ఆయన అనుచరులు కాంగ్రెస్‌లో చేరగా... మాజీ మంత్రి జూపల్లి కూడా త్వరలో మహబూబ్‌నగర్‌లో జరిగే బహిరంగసభలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఈ క్రమంలో ఇవాళ మాజీ ఎంపీ, కాంగ్రెస్‌నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో చేరికపై ఇరువురు నేతలు చర్చించినట్టు సమాచారం. రాజగోపాల్‌రెడ్డి తిరిగి సొంతగూటికి చేరుతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో పొంగులేటితో రాజగోపాల్‌రెడ్డి భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే.
ఈ చేరికలలో భాగంగానే కొద్ది రోజుల క్రితం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన అన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా.. తిరిగి హస్తం పార్టీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రియాంక గాంధీని కలిసినప్పుడు కూడా రాజగోపాల్‌రెడ్డి ప్రస్తావన తీసుకురాగా రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో చర్చించాలని ఆమె సూచించినట్లు తెలిసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కూడా ఏఐసీసీ పెద్దలను తరచూ కలుస్తున్నట్లు తెలుస్తోంది. నెలాఖరున సభలు నిర్వహించి చేరికలు పూర్తయితే పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం వస్తుందని, ఎన్నికల సమయానికి కొత్త చేరికలు క్యాడర్‌లో జోష్ నింపుతాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
BRS Leaders To Join In Congress : మరోవైపు కాంగ్రెస్‌లో చేరికల జోష్ కన్పిస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ, భారత్ రాష్ట్ర సమితి ముఖ్య నాయకులను హస్తం గూటికి రప్పించేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల చివరి వారంలో పెద్ద ఎత్తున చేరికలు ఉండే అవకాశాలు ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వీరుకాకుండా హస్తం నుంచి భారతీయ జనతా పార్టీలోకి వెళ్లిన నాయకులను ఘర్‌వాపసి పేరుతో తిరిగి పార్టీలోకి రప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఇవీ చదవండి :