తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​లో ముగ్గురు ఉగ్ర అనుమానితుల అరెస్ట్​ - బంగాల్​లో ఉగ్ర అనుచరుల అరెస్ట్​

ఉగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ముగ్గురు అనుమానితులను బంగాల్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. దక్షిణ కోల్​కతాలోని హరిదేవ్​పుర్​లో వీరిని అదుపులోకి తీసుకున్నారు.

terrorists arrests
ఉగ్రవాదుల అరెస్ట్​

By

Published : Jul 11, 2021, 7:23 PM IST

బంగాల్‌లో ముగ్గురు ఉగ్రవాద అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ కోల్‌కతాకు సమీపంలోని హరిదేవ్‌పూర్‌ ప్రాంతంలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు బంగాల్ పోలీసులు తెలిపారు. వారు బంగ్లాదేశ్‌కు చెందిన జమాత్‌ ఉల్‌ ముజాహిదీన్‌ సంస‌్థ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నట్లు చెప్పారు.

గత కొన్ని నెలలుగా కోల్‌కతాలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నట్లు సమాచారం రాగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వారి వ్యక్తిగత ఫేస్‌బుక్‌ వివరాలతో పాటు ఓ డైరీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డైరీలో జమాత్‌ ఉల్‌ ముజాహిదీన్‌కు చెందిన ముఖ్యనేతలకు సంబంధించి కీలక సమాచారం ఉన్నట్లు వెల్లడించారు. వారి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు విచారణ జరుపుతున్నట్లు వివరించారు.

యూపీలో ఇద్దరు..

ఉత్తర్‌ప్రదేశ్‌ లఖ్‌నవూలో అల్‌ఖైదా ఉగ్రసంస్థకు చెందిన ఇద్దరు వ్యక్తులను యాంటీ టెర్రరిజం స్వ్కాడ్‌ అరెస్టు చేసింది. దుబగ్గా ప్రాంతంలోని కాకొరిలో ఉన్న ఓ ఇంటిలో ఏటీఎస్​ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా ఉన్న పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన ఉగ్రవాదులు సరిహద్దు దాటి సంబంధాలు కలిగి ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. ఉగ్రవాద కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని వారి వద్ద నుంచి రాబట్టనున్నట్లు చెప్పారు.

ఇవీ చూడండి:

ఐసిస్​ 'ఉగ్ర' నియామకం- రంగంలోకి ఎన్​ఐఏ

11 మంది సర్కారీ ఉద్యోగులపై వేటు

ABOUT THE AUTHOR

...view details