కోల్‌కతాలోని వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించి 11 నెలల చిన్నారి ప్రాణాలను కాపాడారు. దీప్దాస్ అనే చిన్నారి బ్లేడును మింగేశాడు. దీంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. హుటాహటిన అతడి తల్లి ఆస్పత్రికి తరలించింది. ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వైద్యులు 45 నిమిషాల పాటు కష్టపడి ఆపరేషన్ చేసి బ్లేడును బయటకు తీశారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
బ్లేడును మింగిన 11నెలల చిన్నారి.. 45 నిమిషాలపాటు శ్రమించి కాపాడిన వైద్యులు.. - nil ratan doctors saves 11months child
కోల్‌కతాలోని ఓ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. బ్లేడును మింగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న 11నెలల చిన్నారికి ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు.
చిన్నారి తల్లి తెలిపిన వివరాల ప్రకారం..
ముర్షిదాబాద్కు చెందిన 11 నెలల దీప్దాస్ అనే చిన్నారి గురువారం ఇంటి చుట్టు పక్కల పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాడు. అంతలోనే ఒక్కసారిగా కిందపడిపోయాడు. వెంటనే తన తల్లి వెళ్లి చూడగా దీప్దాస్ కాలికి గాయమై రక్తం కారుతుంది. ఆ గాయాన్ని పరీక్షించగా కాలిలో చిన్న బ్లేడ్ ముక్క కనిపించింది. వెంటనే చిన్నారి బ్లేడ్ మింగి ఉంటాడని భావించి అతడి తల్లి ఆస్పత్రికి తరలించింది. అక్కడ వైద్యులు చిన్నారికి ఎక్స్రే తీయగా కడుపులో బ్లేడు ఉన్నట్లు తెలిసింది.
వెంటనే బహరంపుర్ మెడికల్ కాలేజీకి తీసుకు వెళ్లగా.. వారు కోల్‌కతాలోని ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. గురువారం సాయంత్రం ఆస్పత్రిలో చేర్చించగా.. శుక్రవారం ఉదయం వైద్యులు చిన్నారికి శస్త్రచికిత్స చేశారు. దాదాపు 45 నిమిషాల పాటు ఆపరేషన్ చేసి బ్లేడుని బయటకు తీసినట్లు డాక్టర్ నిరూప్ బిస్వాస్ తెలిపారు.
TAGGED:
latest kolkata news