Kolhpur north mla: మహారాష్ట్ర కొల్హాపుర్ ఉత్తర ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత చంద్రకాంత్ జాదవ్(57) ఇక లేరు. అనారోగ్యం బారినపడి హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్ నుంచి కొల్హాపుర్కు చంద్రకాంత్ జాదవ్ భౌతికకాయాన్ని తరలించారు.
congress mla chandrakant jadhav: కొల్హాపుర్ ఉత్తర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రకాంత్ పోటీ చేశారు. ఎన్నికల్లో శివసేన పార్టీ అభ్యర్థి రాజేశ్ క్షీరసాగర్ను ఓడించి ఆయన ఎమ్మెల్యే పదవి చేపట్టారు. కొల్హాపుర్లోని వివిధ కుస్తీ శిక్షణ కేంద్రాలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.