మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత అజిత్ పవార్ (Ajit Pawar News) బంధువుల నివాసాలు, కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ గురువారం దాడులు (IT Raid) జరిపింది. పన్ను ఎగవేత ఆరోపణలపై ఆ రాష్ట్రంలోని కొందరు స్థిరాస్తి వ్యాపారుల ఇళ్లు, ఆఫీసుల్లోనూ సోదాలు చేసింది.
ముంబయి (IT Raid in Mumbai), పుణె, సతారా సహా మహారాష్ట్ర, గోవాలోని మరికొన్ని నగరాల్లో ఐటీ దాడులు జరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. డీబీ రియాల్టీ, శివాలిక్, జరండేశ్వర్ సాఖర్ షుగర్ కార్ఖానా (జరండేశ్వర్ ఎస్ఎస్కే), పవార్ సోదరీమణుల (Ajit Pawar Family) వ్యాపార సముదాయాల్లో సోదాలు చేసినట్లు తెలిపాయి. ఇప్పటికే కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకుని, వాటిని పరిశీలిస్తున్నట్లు చెప్పాయి.
జరండేశ్వర్ ఎస్ఎస్కేపై గతంలోనే..
మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద జరండేశ్వర్ ఎస్ఎస్కే ఆధ్వర్యంలోని షుగర్ మిల్కు (Jarandeshwar Sugar News) చెందిన రూ.65కోట్లు విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జులైలోనే జప్తు చేసింది. సహకార సంస్థగా నడుస్తున్న ఈ షుగర్ మిల్.. పవార్ కుటుంబానికి సంబంధించిందేనని ఈడీ (Enforcement Directorate News) పేర్కొంది.
"జరండేశ్వర్ ఎస్ఎస్కేకు చెందిన ఆస్తులు.. గురు కమొడిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇది ఒక డమ్మీ కంపెనీగా ఆరోపణలున్నాయి) పేరిట ఉన్నాయి. దాని నుంచి వాటిని జరండేశ్వర్ షుగర్ మిల్స్‌కు లీజుకు ఇచ్చారు. జరండేశ్వర్ షుగర్ మిల్స్‌లో మెజారిటీ వాటా స్పార్క్లింగ్ సాయిల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఉంది. అది అజిత్ పవార్, ఆయన భార్య సునేత్ర పవార్‌కు (Ajit Pawar Family) చెందినదే అని దర్యాప్తులో తేలింది" అని ఈడీ ఓ ప్రకటనలో పేర్కొంది. అజిత్ పవార్ (Ajit Pawar News) మాత్రం తాను ఏ తప్పు చేయలేదని చెప్పారు.
ఇదీ జరిగింది..
మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు (ఎంఎస్సీబీ) కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ ఈ సోదాలు చేపట్టింది. ఈ (MSCB Scam) కేసులో.. షుగర్ ఫ్యాక్టరీ(ఎస్ఎస్కే)లను ఎంఎస్సీబీ అధికారులు, డైరెక్టర్లు ఎస్ఏఆర్ఎఫ్ఏఈఎస్ఐ చట్టానికి లోబడి సరైన ప్రక్రియను అనుసరించకుండా చాలా చౌకగా తమ బంధువులకు అమ్మేశారనే ఆరోపణలున్నాయి.
"2010లో జరండేశ్వర్ ఎస్‌ఎస్‌కేను నిబంధనలకు విరుద్ధంగా తక్కువ విలువకే ఎంఎస్సీబీ వేలం వేసింది. ఆ సమయంలో ఎంఎస్సీబీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లలో అజిత్ పవార్ అత్యంత కీలకమైన, శక్తిమంతమైన సభ్యుడు" అని ఈడీ (Enforcement Directorate News) పేర్కొంది.