ఈ ఏడాది సూపర్ మూన్, బ్లడ్ మూన్, చంద్రగ్రహణాలకు సాక్ష్యంగా నిలిచిన ఆకాశవేదికలో మరో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. జూన్ 10న వలయాకార సూర్యగ్రహణం ఏర్పడనుంది. మధ్యాహ్నం 1:42 గంటల నుంచి సాయంత్రం 6:41 గంటల మధ్య ఇది ఏర్పడనుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) తెలిపింది. ఈ మేరకు పలు మీడియాలు కథనాలు వెలువరించాయి.
ఈ ఏడాదిలో ఏర్పడనున్న తొలి సూర్యగ్రహణం ఇదే కావటం గమనార్హం. భారత్లోని ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్లో ఇది పాక్షికంగా కనిపించనుండగా.. ఉత్తర అమెరికా, కెనడా, ఐరోపా, రష్యాలో సంపూర్ణంగా కనిపించనుంది.
వలయాకార సూర్యగ్రహణం అంటే..?