తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విడాకుల గురించి గొడవ- కోర్టులోనే బావపై కత్తితో దాడి - బావను కత్తితో పొడిచిన బావమరిది

Knife attack in court: కర్ణాటకలో కోర్టు ఆవరణలోనే దారుణం జరిగింది. తన బావపై కత్తితో దాడి చేశాడు ఓ వ్యక్తి. విడాకుల విషయమై కోర్టుకు వెళ్లిన ఇరు కుటుంబాల మధ్య జరిగిన వాగ్వాదం ఈ ఘటనకు దారితీసింది.

Man stabs brother-in-law on court premises
బావపై కత్తితో దాడి

By

Published : Dec 7, 2021, 6:55 PM IST

Knife attack in court: కర్ణాటక దావణగెరె జిల్లాలో దారుణం జరిగింది. కోర్టు ఆవరణలోనే బావపై కత్తితో దాడి చేశాడు ఓ వ్యక్తి.

విడాకుల విషయమై కోర్టుకు వెళ్లిన రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన నిందితుడు.. తన బావను కత్తితో పొడిచి చంపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన జగలూరు తాలూకాలో జరిగింది.

నిందితుడిని హరపనహళ్లి తాలూకా హిరేమేగలగెరె గ్రామానికి చెందిన మల్లికార్జునగా గుర్తించారు. బాధితుడిని జగలూరు తాలూకాలోని గడిమకుంటె గ్రామానికి చెందిన మంజునాథ్‌గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన మంజునాథ్‌ ఆస్పత్రి తరలించారు.

స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మంజునాథ్ పండిట్, డీఎస్పీ కన్నిక ఘటనా స్థలానికి సందర్శించి.. పరిస్థితిని సమీక్షించారు.

ఇదీ చూడండి:17మంది బాలికలపై ప్రిన్సిపల్ లైంగిక దాడి.. భోజనంలో మందు కలిపి...

ABOUT THE AUTHOR

...view details