మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఉద్రిక్తత! KMC election 2021: కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్‌కు జరుగుతున్న ఎన్నికల్లో అక్కడక్కడా స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. ఉత్తర కోల్‌కతాలో తృణమూల్ కార్యకర్తలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. సీల్డా ప్రాంతంలోని టాకి పాఠశాలలోని పోలింగ్ బూత్ వద్ద టీఎంసీ కార్యకర్తలు ఓటర్లను మభ్యపెడుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.
ఇదే పోలింగ్ బూత్ వద్ద నాటు బాంబు దాడి జరిగింది. గుర్తుతెలియని దుండగుడు బాంబు విసిరినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓ ఓటరుకు గాయాలయ్యాయి.
నాటు బాంబు దాడి జరిగిన ప్రాంతం KMC polling news:
జొరాషంకో ప్రాంతంలో భాజపా కౌన్సిలర్ మీనాదేవి పురోహిత్.. అధికార పార్టీ కార్యకర్తలపై ఫిర్యాదు చేశారు. టీఎంసీ కార్యకర్తలు తనను ఎగతాళి చేస్తూ మాట్లాడారని ఆరోపించారు. ఈ క్రమంలో ఉద్రిక్తత తలెత్తగా తన దుస్తులు కొద్దిగా చినిగిపోయాయని అన్నారు. అయితే, పురోహిత్ వ్యాఖ్యలను అధికార టీఎంసీ ఖండించింది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఉద్రిక్తతలు రాజేసేందుకు తప్పుడు ఆరోపణలు చేయడం ఆమెకు సాధారణమేనని ఎద్దేవా చేసింది.
చినిగిన జాకెట్ చూపిస్తున్న మీనాదేవి పురోహిత్ పలు పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు మొరాయించడం వల్ల ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. కొన్ని కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు సరిగా పనిచేయడం లేదని విపక్ష పార్టీలు ఆరోపించాయి. వీటిని రాష్ట్ర ఎన్నికల సంఘం ఖండించింది.
మరోవైపు, శనివారం రాత్రి నుంచి ఏజెంట్లకు బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయని సీపీఎం నాయకులు ఆరోపించారు.
ఓటరు శరీర ఉష్ణోగ్రత తనిఖీ చేస్తున్న సిబ్బంది KMC polling percentage
మొత్తం 144 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 40 లక్షల మంది అర్హులైన ఓటర్లు ఈ వార్డుల పరిధిలో ఉన్నారు. ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభం కాగా.. తొలి రెండు గంటల్లో పోలింగ్ 9.09 శాతంగా నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. డిసెంబర్ 21న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
ఓటరుకు పోలింగ్ బూత్ దారి చూపిస్తున్న సిబ్బంది గుజరాత్లో పంచాయతీ ఎన్నికలు
Gujarat panchayat election:అటు, గుజరాత్లో గ్రామపంచాయతీ ఎన్నికలకు సైతం ఓటింగ్ జరుగుతోంది. 8690 గ్రామ పంచాయతీల కోసం 23 వేల కేంద్రాలు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. పంచాయతీ ఎన్నికలను వివిధ రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి.
ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. 27,200 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పంచాయతీ సభ్యుల పదవుల కోసం 1,19,998 మంది పోటీ చేస్తున్నారు.
ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 23,112 బూత్‌లలో 37,451 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. ఏకంగా కోటి 81 లక్షల మంది ఓటర్లు ఎన్నికల్లో పాల్గొననున్నారు.
ఇదీ చదవండి:పిల్ల కొండముచ్చు కోసం తల్లి విలవిల