Kishore Upadhyay News: ఉత్తరాఖండ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కిశోర్ ఉపాధ్యాయ్.. పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరణకు గురయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధిష్ఠానం తెలిపింది. క్రమశిక్షణా చర్యల కింద అన్ని పదవుల నుంచి గతంలోనే ఆయనను తొలగించింది కాంగ్రెస్ పార్టీ.
కిశోర్ ఉపాధ్యాయ్‌ను బహిష్కరించిన కాంగ్రెస్ "పలుమార్లు హెచ్చరికలు చేసినప్పటికీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు పార్టీ సభ్యత్వం నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నాం."
-ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)
Kishore Upadhyay to Join BJP: అయితే.. ఉత్తరాఖండ్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కిశోర్ ఉపాధ్యాయ్ భాజపాలో చేరారు. ఉత్తరాఖండ్ భాజపా వ్యవహారాల ఇంఛార్జ్ ప్రహ్లాద్ జోషితో సహా ప్రముఖుల సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకే భాజపాలో చేరినట్లు తెలిపారు. తన నిర్ణయానికి గల కారణాన్ని కాంగ్రెస్‌నే అడగాలని చెప్పారు.
భాజపాలో చేరిన కిశోర్ ఉపాధ్యాయ్ కిశోర్ ఉపాధ్యాయ్‌కు మంచి పట్టున్న 'టిహరీ' నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2002, 2007 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేసి గెలుపొందారు.
మీడియా సమక్షంలో మాట్లాడుతున్న కిశోర్ ఉపాధ్యాయ్ సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి:కాంగ్రెస్‌కు సీనియర్లు గుడ్‌బై.. వరుస వలసలకు కారణమేంటి?