Kishan Reddy Responds on Telangana BJP State President : బీజేపీ తెలంగాణ చీఫ్‌గా బాధ్యతలు ప్రకటించిన తర్వాత.. తొలిసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. 'నేను పార్టీకి విధేయుడిని. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను. అధిష్ఠానం నిర్ణయం మేరకు ముందుకు సాగుతా. జులై 8న వరంగల్‌లో ప్రధాని మోదీ సభ తర్వాత అధ్యక్ష బాధ్యతలు చేపడతాను. కేంద్ర మంత్రి స్థానానికి సంబంధించి అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా.. దానికి కట్టుబడి ఉంటా' అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
Kishan Reddy absent Union Ministers meeting : మరోవైపు దిల్లీ కేంద్రమంత్రి వర్గ భేటీ జరుగుతోంది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గైర్హాజరయ్యారు. కేబినేట్ సమావేశానికి వెళ్లకుండా దిల్లీలోని తన నివాసంలో కిషన్‌రెడ్డి ఉండిపోయారు. మరోవైపు ఆయన సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. అందుబాటులో ఉన్న పార్టీ పార్టీ పదాధికారులు.. అధికార ప్రతినిధులు జాతీయ కార్యవర్గ సభ్యులు ముఖ్య నేతలతో సాయంత్రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలోనే మోదీ పర్యటనపైన సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే రేపు ఉదయం వరంగల్‌కు వెళ్లనున్న కిషన్‌రెడ్డి.. ఎనిమిదో తేదీ వరకు అక్కడే ఉండనున్నారు.
రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడి మార్పుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడిన విషయం తెలిసిందే. జాతీయ నాయకత్వం తెలంగాణ అధ్యక్షుడిని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. బండి సంజయ్ స్థానంలో.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కొత్తసారథిగా నియమించింది. త్వరలో పలు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కమలదళం సంస్థాగత మార్పులు చేపట్టిం. అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం పట్లకేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇంతవరకూ స్పందించలేదు. మీడియా ప్రతినిధులు చుట్టు ముట్టి ప్రశ్నలు సంధించినా మౌనంగా వెళ్లిపోయారు.. తప్పితే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ క్రమంలోనే ఆయన కేంద్రమంత్రి వర్గ సమావేశానికి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.