తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కొత్త సాగు చట్టాలు రద్దు చేస్తే ఉద్యమిస్తాం' - సాగు చట్టాలను రద్దు చేస్తే ఉద్యమిస్తాం

సాగు చట్టాలపై నిరసనలతో దిల్లీ అట్టుడుకుతున్న సమయంలో మరో రైతు సంఘం ప్రభుత్వానికి మద్దతు తెలిపింది. చట్టాలు రైతులకు లాభదాయకమని ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన కిసాన్​ సేన వ్యాఖ్యానించింది. అంతే కాదు, రద్దుకు ప్రయత్నిస్తే ఉద్యమిస్తామని హెచ్చరించింది.

Kisan Sena warns of bigger protest if farm laws repealed, kisan sena, support to farm laws
'సాగు చట్టాలు రద్దు చేస్తే ఉద్యమిస్తాం'

By

Published : Dec 25, 2020, 9:54 AM IST

వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కిసాన్ సేన కేంద్రాన్ని హెచ్చరించింది. ఉత్తర్​ప్రదేశ్​లోని 15 జిల్లాలకు చెందిన ప్రతినిధులు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర​ సింగ్​ తోమర్​తో గురువారం భేటీ అయ్యారు. చట్టాలు రైతులకు లాభదాయకమని వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపసంహరించుకోవద్దని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు.

వారు అప్పుడేం చేయలేదు..

సంస్కరణలపై ప్రశ్నిస్తోన్న పార్టీలు సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్నా.. రైతు సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదని తోమర్ అన్నారు. చట్టాలపై నాలుగు వారాలుగా రైతులు నిరసిస్తున్నారు. ఈ సమయంలో పలు రైతు సంఘాలు చట్టాలకు మద్దతు తెలపడం గమనార్హం.

ఇదీ చూడండి :ఆపరేషన్​ యూకే: వారి కోసం వెదుకులాట

ABOUT THE AUTHOR

...view details