ఓ రోగిని జిల్లా ఆస్పత్రి నుంచి స్ట్రెచర్‌పై నేరుగా డాక్టర్ ఇంటికే తీసుకెళ్లారు బంధువులు. ఆస్పత్రిలో ప్రముఖ వైద్యుడు లేడని తెలిసి, ఎలాగైనా అతని వద్దకే వెళ్లాలని ఇలా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఛత్తీస్‌గఢ్ కోరియా జిల్లాలోని వైకుంఠపుర్లో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
ఆస్పత్రి సివిల్ సర్జన్ కేఎల్ ధ్రువ్ దీనిపై వివరణ ఇచ్చారు. ఓ కుటుంబం రోగిని మధ్యాహ్నం 1:30 గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చిందని, కానీ 1:00 గంటలకే ఓపీ టైం అయిపోయిందని చెప్పారు. రోగిని చూడటానికి ప్రముఖ వైద్యుడు ఆస్పత్రిలో లేడని తెలిశాక కుటుంబసభ్యులు అతడ్ని స్ట్రెచర్‌పై డాక్టర్ ఇంటికే తీసుకెళ్లారని చెప్పారు. అయితే డాక్టర్ సూచన మేరకు రోగిని మళ్లీ ఆస్పత్రికే తీసుకొచ్చారని, చికిత్స ప్రారంభించామని పేర్కొన్నారు. ఓపీ టైం అయిపోవడం వల్ల స్ట్రెచర్‌ను తీసుకెళ్లడం సిబ్బంది ఎవరూ గమనించలేదన్నారు.