తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'లాలూ ప్రసాద్​కు కిడ్నీ ఇచ్చిన కుమార్తె.. ఆపరేషన్​ సక్సెస్' - Lalu Yadav in Singapore

ఆర్జేడీ అధ్యక్షుడు, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైందని ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు.

RJD President
ఆర్జేడీ అధ్యక్షుడు

By

Published : Dec 5, 2022, 3:40 PM IST

Updated : Dec 5, 2022, 4:52 PM IST

బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు సింగపూర్​లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. ఆయన రెండో కుమార్తె రోహిణీ ఆచార్య కిడ్నీని లాలూ(74)కు సోమవారం అమర్చారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ తెలిపారు. "విజయవంతమైన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత ఆర్జేడి జాతీయ అధ్యక్షురాలు, మా అక్క రోహిణి ఆచార్య క్షేమంగా ఉన్నారు. వారి కోసం ప్రార్థించి, శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు" అంటూ తేజస్వీ యాదవ్ ట్వీట్ చేశారు.

లాలూకు శస్త్రచికిత్స నేపథ్యంలో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు బిహార్​వ్యాప్తంగా ప్రత్యేక పూజలు చేయించారు. పట్నా సహా వేర్వేరు చోట్ల ఆలయాల్లో హోమాలు, మృత్యుంజయ జపాలు జరిపించారు. "మా అధినేత దీర్ఘకాలం జీవించాలి. ప్రతి తల్లితండ్రులు రోహిణి లాంటి కుమార్తె ఉండాలి" అని బిహార్ ఆర్జేడీ అధ్యక్షుడు జగదానంద్ సింగ్ పట్నాలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అన్నారు.

అనేక దాణా కుంభకోణం కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ వైద్యపరమైన కారణాలతో బెయిల్‌పై విడుదలయ్యారు. కొన్నేళ్లుగా తన కిడ్నీ, గుండె సమస్యలకు దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఇక్కడ డాక్టర్లు ఆయనకు కిడ్నీ మార్పిడిని సూచించలేదు. కానీ, తండ్రి ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన చెందిన రోహిణి.. ఆయన్ను సింగపూర్‌లోని వైద్య బృందానికి చూపించారు. వారి సూచన మేరకు లాలూ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు.
రోహిణి ఆచార్య తన 40 ఏళ్ల వయస్సులో సింగపూర్‌కు చెందిన సాఫ్ట్​వేర్ ప్రొఫెషనల్‌ను వివాహం చేసుకున్నారు. తండ్రి కోసం ఆమె తీసుకున్న నిర్ణయానికి గానూ.. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.

ఇవీ చదవండి:అప్పు కోసం మహిళ దారుణ హత్య.. కత్తితో ఛాతిని కోసి..

గుజరాత్​లో రెండో దశ పోలింగ్​​.. మధ్యాహ్నం 2గంటల వరకు 39% ఓటింగ్

Last Updated : Dec 5, 2022, 4:52 PM IST

ABOUT THE AUTHOR

...view details