బిహార్‌లోని బక్సర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కిడ్నాప్ చేసిన ఆరు రోజుల తరువాత బాధితురాల్ని రైల్వే ప్లాట్‌ఫాంపై వదిలి పారిపోయారు.
పోలీసుల వివరాల ప్రకారం..జిల్లాలోని డుమ్రావ్ సబ్ డివిజన్‌కు చెందిన బాధితురాల్ని ఆరు రోజుల క్రితం ఆరుగురు యువకులు కిడ్నాప్ చేశారు. అనంతరం పట్నా తీసుకెళ్లి బందీగా ఉంచి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అయితే అప్పటికే బాధితురాలి తల్లిదండ్రులు బాలిక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా డుమ్రావ్ రైల్వేస్టేషన్లో బాధితురాలు ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడ చేరుకున్న పోలీసులు.. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి వాంగ్మూలం మేరకు గాలింపు చర్యలను వేగవంతం చేసిన పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మిగతా నలుగురి కోసం గాలిస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. యువతిపై గ్యాంగ్‌రేప్
దేశ రాజధానిలో దారుణం జరిగింది. ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపించి ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు యువకులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.