Electric Bike Battery Blast: మహారాష్ట్రలోని వసాయ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఛార్జింగ్‌లో ఉన్న ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ బాలుడు తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతూ మరణించాడు.
ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి చిన్నారి మృతి.. ఛార్జింగ్ అవుతుండగానే.. - బ్యాటరీ బైక్ పేలుడు
Electric Bike Battery Blast : పర్యావరణానికి హాని కలగకూడదనే ఉద్దేశంతో వినియోగిస్తున్న ఎలక్టిక్ బైక్ వారి ఇంట విషాదం నింపింది. ఛార్జింగ్ పెట్టిన సమయంలో బ్యాటరీ పేలడం వల్ల చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు.
అసలేం జరిగిందంటే..
తూర్పు వసాయ్ ప్రాంతంలో రాందాస్ నగర్‌కు చెందిన షానవాజ్ అన్సారీ.. సెప్టెంబరు 23వ తేదీ తెల్లవారుజామున తన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టాడు. అనంతరం ఇంట్లో అందరూ పడుకున్నారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో బ్యాటరీ ఒక్కసారిగా పేలింది. దీంతో ఆ సమయంలో అక్కడే ఉన్న షానవాజ్ అన్సారీ కుమారుడు షబ్బీర్, తల్లి రుక్సాన్‌కు తీవ్రగాయాలయ్యాయి.
షబ్బీర్‌కు కాలిన గాయాలు ఎక్కువగా అవ్వడం వల్ల చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ షబ్బీర్ మరణించాడు. స్కూటీ కంపెనీ తప్పిదం వల్లే ఈ ఘటన జరిగిందని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.